BigTV English

Vishwambhara: విశ్వంభరలో చిరు సూపర్ హిట్ రీమిక్స్ సాంగ్.. బాస్ కోసం పాటలే దొరకలేదా?

Vishwambhara: విశ్వంభరలో చిరు సూపర్ హిట్ రీమిక్స్ సాంగ్.. బాస్ కోసం పాటలే దొరకలేదా?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల ఎంతో బిజీ అవుతున్నారు. అయితే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నుంచి ఆశించిన స్థాయిలో హిట్ సినిమా రాకపోవడంతో మెగా అభిమానులలో ఏదో తెలియని నిరాశ ఉందని తెలుస్తోంది. రీ ఎంట్రీ తర్వాత పలు సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో చిరంజీవి తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. ఇక త్వరలోనే ఈయన డైరెక్టర్ వశిష్ట (Vasista)దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, త్రిష(Trisha) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా తరచు వాయిదా పడుతూ వస్తుంది.


చిరంజీవికి జోడిగా నాగిని బ్యూటీ..

నిజానికి ఈ ఏడాది సంక్రాంతికే ఈ సినిమా విడుదల కావలసి ఉండగా రామ్ చరణ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరంజీవి పక్కకు తప్పుకున్నారు. అయితే కొన్ని విఎఫ్ ఎక్స్ పనులు కూడా పూర్తి కాలేదని, అలాగే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కాలేదని సమాచారం. ఇలా కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నాగిని బ్యూటీ మౌని రాయ్(Mouni Rai) నటించబోతున్న విషయం తెలిసిందే.


ఆటకావాలా… పాట కావాలా సాంగ్ రీమిక్స్..

చిరంజీవి సినిమా అంటే ప్రత్యేకంగా ఒక స్పెషల్ సాంగ్ క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ విశ్వంభర సినిమా కోసం మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి పాటను రాయలేదని సమాచారం. అయితే చిరంజీవి నటించిన సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చిత్రం అన్నయ్య (Annayya)సినిమాలో “ఆట కావాలా.. పాట కావాలా” (Ata kavala pata kavala)అనే పాటను తిరిగి విశ్వంభర సినిమాలో రీమిక్స్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారడంతో అభిమానుల నుంచి విభిన్న స్పందన లభిస్తోంది.

చిరుకి స్పెషల్ సాంగ్ దొరకలేదా…

చిరంజీవి సినిమా కోసం ఇదివరకే హిట్ అయిన పాటను పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ పలువురు కామెంట్లు చేయగా, మరికొందరు చిరంజీవి లాంటి స్టార్ హీరోకి స్పెషల్ సాంగ్ దొరకలేదా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మరి చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న ఈ వార్తలలో నిజం ఏటి అనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాని యు.వి క్రియేషన్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నారు. స్టాలిన్ సినిమా తర్వాత మరోసారి త్రిష చిరంజీవి జంటగా ఈ సినిమాలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక బింబిసారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట తన రెండవ సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశం అందుకున్నారు. మరి ఈ సినిమాతో డైరెక్టర్ ఎలాంటి హిట్ అందుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.

Also Read: విషమంగానే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి… గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్!

Related News

Keerthy Suresh: Ai తెచ్చిన తంటా, ఏకంగా మహానటికే బట్టలు లేకుండా చేశారు

Mega Blast Glimpse : విశ్వంభర గ్లిమ్స్ అవుట్, ఇక ట్రోలింగ్ కు ఆస్కారమే లేదు

Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిస‌లాట… స్పాట్ లోనే 400 మంది?

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్

Heroine: ఆ ఎమ్మెల్యే హోటల్‌కి రమ్మంటున్నాడు.. హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

Big Stories

×