Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈయన రెండు కిడ్నీలు(Kidneys) పాడవడంతో గత కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే ఇటీవల తన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిన నేపథ్యంలో హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటనే తనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు కూడా సూచించారు.
కిడ్నీ మార్పిడి..
ఇలా కిడ్నీ మార్పిడి చేయడం అంటే డబ్బుతో కూడుకున్న విషయం అంతే కాకుండ, సరైన కిడ్నీ దొరకడం కూడా కష్టతరమే. ఈ క్రమంలోనే తమ తండ్రి పరిస్థితి చూసి ఫిష్ వెంకట్ కుమార్తె, ఆయన భార్య ఎంతో ఎమోషనల్ అవుతూ ఎవరైనా సహాయం చేయండి అంటూ వేడుకున్నారు.ఇలా ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఫిష్ వెంకట్ కుటుంబానికి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)అండగా నిలిచారని తెలుస్తోంది. ఈయన పరిస్థితి తెలుసుకున్న ప్రభాస్ అసిస్టెంట్ ఫిష్ వెంకట్ కుమార్తెకు ఫోన్ చేసినట్లు స్వయంగా ఆమె వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభాస్ అసిస్టెంట్ గారు ఫోన్ చేశారని, సర్జరీకి ఎంతైనా ఖర్చు పెట్టుకుంటానని చెప్పినట్లు తెలిపారు.
50 లక్షల రూపాయలు…
సర్జరీ కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేదని, కిడ్నీ దొరికితే వెంటనే సర్జరీ చేయించమని ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తన తండ్రికి సరిపడా కిడ్నీ దొరకలేదని ఫిష్ వెంకట్ కుమార్తె తెలియజేశారు.అమ్మది, నా బ్లడ్ గ్రూపు వేరుగా ఉందని బాబాయ్ వాళ్ళ కిడ్నీ సరిపోయినప్పటికీ వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటూ ఫిష్ వెంకట్ కుమార్తె తెలియజేశారు. ఇక సర్జరీ చేయడం కోసం సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినట్టు ఈమె తెలియజేశారు.
ఫిష్ వెంకట్ కు అండగా ప్రభాస్..
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ సినిమాలకు కూడా సుదూరంగా ఉన్నారు. ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకున్నారు. గతంలో కూడా ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషయమించిన నేపథ్యంలో సహాయం కోసం ఈ తల్లి కూతుర్లు ఎదురుచూస్తున్నారు. మరి ఫిష్ వెంకట్ కు సరిపడా కిడ్నీ దొరికితేనే సర్జరీ చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈయన పరిస్థితి తెలిసి ప్రభాస్ ముందుకు వచ్చారనే విషయం తెలియగానే ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభాస్ ఎవరితోనూ మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపించరు కానీ ఎవరికైనా సహాయం చేయాలి అంటే ముందు వరుసలో ఉంటారు. ఇక ఆయన చేసిన సహాయాన్ని కూడా బయటకు చెప్పుకోరనే విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: ప్రభాస్ నరకం స్పెల్లింగ్ రాయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి?