కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కొన్ని సంస్థలు క్రేజీ ఆలోచనలు చేస్తుంటాయి. కొన్ని సంస్థలు ఓపెనింగ్ రోజు ఫ్రీ ఆఫర్ ఇస్తుంటాయి. మరికొన్ని తక్కువ ధరలకే వస్తువులు అందిస్తుంటాయి. రష్యాలోఓ పెట్రోల్ బంక్ ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఫన్నీగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ కాస్తే నవ్వుల పువ్వులు పూయించింది. రష్యాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ అసలు ఆఫర్ ఏంటంటే..
రష్యా సమారాలోని ఓల్వి అనే ఫిల్లింగ్ స్టేష్టన్ ఉంది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ సంస్థ యాజమాన్యం సరికొత్త ఆలోచన చేసింది. చివరకు బికినీలో వచ్చిన వారికి ఉచితంగా పెట్రోల్ అందిస్తామని ప్రకటించింది. “బికినీలో రండి ఉచితంగా పెట్రోల్ పొందండి” అని ఆఫర్ ప్రకటించింది. అంతేకాదు, బికినీలో వచ్చే వాళ్లు కావాలనుకుంటే హై హీల్స్ కూడా ధరించవచ్చని వెల్లడించింది. బికినీలో వచ్చి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకోవచ్చన్నారు అక్కడి సిబ్బంది. ఈ ఆఫర్ ను సుమారు 3 గంటల పాటు అందుబాటులో ఉంచారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏర్పడింది.
బికీనిలో వస్తే ఫ్రీ పెట్రోల్ అని చెప్పిన సంస్థ.. కేవలం మహిళలకే అని చెప్పలేదు. కానీ, వాళ్లు మహిళలు మాత్రమే వస్తారని అనుకున్నారు. తీరా.. ఆఫర్ టైమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది పురుషులు కూడా బికినీలో వచ్చారు. వారు ఉచితంగా తమ వాహనాలకు పెట్రోల్ కొట్టించుకున్నారు. అంతేకాదు, కొంత మంది మగాళ్లు బికినీ వేసుకోవడంతో పాటు హైహీల్స్ కూడా ధరించి వచ్చారు. 2016లో జరిగిన ఘటనల అప్పట్లో రష్యాలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా ఈ ఆఫర్ ను హైలెట్ చేయడంతో అంతా నవ్వుకున్నారు. ఈ ఆఫర్ తో ఆ పెట్రోల్ బంక్ కు కూడా మంచి పాపులారిటీ లభించింది.
బికినీలో వస్తే ఫ్రీ పెట్రోల్ అనే ఆఫర్ సమారాతో పాటు టాటర్ స్తాన్‌లోని మరో పెట్రోల్ బంక్ కూడా ఇచ్చింది. ఇది కూడా 2016లోనే ఈ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఉక్రెయిన్ లో కూడా కొన్ని పెట్రోల్ స్టేషన్లు బికినీ ఆఫర్లను ప్రకటించాయి. అక్కడ కూడా పురుషులు బికినీలు వేసుకుని పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చారు. ఆ ఏడాది పలు పెట్రోల్ బంకులు ఈ ఆఫర్ ను ప్రకటించడం సంచలనం కలిగించాయి. ప్రజలు ఉచితంగా ఏదైనా అందిస్తామంటే ఎంతలా వచ్చేస్తారో ఈ సంఘటలు అప్పట్లో రుజువు చేశాయి. 2016లో రష్యాలో ఎక్కడో ఒకచోట ఇలాంటి బికినీ ఆఫర్లు ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి పలు సంస్థలు. అయితే, ఈ ఆఫర్ కొద్ది గంటలు మాత్రమే అందించేవి. తక్కువ ఖర్చుతో మంచి పాపులారిటీ సంపాదించాయి ఆయా సంస్థలు.