BigTV English

Avatar: Fire and ash: అవతార్3 ఫస్ట్ లుక్, ట్రైలర్ పై బిగ్ అప్డేట్.. వరంగ్ ను కలవడానికి సిద్ధం కండి!

Avatar: Fire and ash: అవతార్3 ఫస్ట్ లుక్, ట్రైలర్ పై బిగ్ అప్డేట్.. వరంగ్ ను కలవడానికి సిద్ధం కండి!

Avatar: Fire and ash:ప్రపంచం మొత్తం పిల్లలను మొదలుకొని పెద్దల వరకు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో అవతార్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇప్పటికే అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా అవతార్ , అవతార్ 2 ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించాయో.. ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు అవతార్ 3 ను త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచ సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో వారికోసం గుడ్ న్యూస్ తెలిపారు.


అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ నుండీ ట్రైలర్ పై బిగ్ అప్డేట్..

దిగ్గజ హాలీవుడ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న జేమ్స్ కామెరూన్ అవతార్ ఫ్రాంచైజీ నుండి మూడవ భాగం “అవతార్ 3 : ఫైర్ అండ్ యాష్” తో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో 2025 డిసెంబర్ 19వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మేరకు తాజాగా ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ.. ట్రైలర్ పై కూడా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అవతార్ 3 మొదటి ట్రైలర్ జూలై 25 2025న ది ఫెంటాస్టిక్ ఫోర్ : ఫస్ట్ స్టెప్స్ ను కేవలం థియేటర్లలో మాత్రమే ప్రత్యేకంగా రిలీజ్ చేయబోతున్నాము అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.


ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

అంతేకాదు థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలైన సమయంలోనే ఈ సినిమా ట్రైలర్ ను ప్రధానంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఊనా చాప్లిన్ పోషించిన కొత్త పాత్ర వరంగ్ ను కలిసే మొదటి వ్యక్తి మీరే అవ్వండి అంటూ మేకర్స్ సినిమాపై హైప్ పెంచేశారు. మొత్తానికైతే మరొక మూడు రోజుల్లో థియేటర్లలో భారీ ఎత్తున అవతార 3 ట్రైలర్ విడుదల కాబోతోందని చెప్పవచ్చు . ప్రస్తుతం అయితే విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో ఒకవైపు యాష్ కలర్ మరొకవైపు రెడ్ కలర్ ఉండేలా అవతార్ ఫేస్ ని డిజైన్ చేశారు. ఇక ఈ సిరీస్ పండోరా గ్రహంపై తన ప్రయాణాన్ని కొనసాగించబోతోందని చెప్పి అంచనాలు పెంచేశారు.

అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ నటీనటులు..

ఇక ఇందులో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్డానా, జోయెల్ డేవిడ్ మూర్, CCH ఫౌండర్, గియో వన్నీ రిబిసి, సిగౌర్ని వీవర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 20వ సెంచరీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించి పంపిణీ చేస్తోంది.

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×