Intinti Ramayanam Today Episode july 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని భరత్ ను, పార్వతి ఎందుకు కొట్టింది అని ప్రణతిని అడుగుతుంది. మా పాటికి మేము కూర్చున్నాం వదిన అమ్మే వచ్చి పెద్ద రచ్చ చేసింది.. అక్షయ వింటే కచ్చితంగా మళ్ళీ గొడవవుతుంది అని ప్రణతిని పక్కకు తీసుకెళ్లి అవని మాట్లాడుతుంది. మీరెందుకు అత్తయ్య ను రెచ్చగొట్టారు అని టెన్షన్ పడుతుంది.. మిమ్మల్ని కిరాణా షాపుకు వెళ్లి సరుకులు తీసుకురమంటే మీరు పార్క్ కి ఎందుకు వెళ్లారు అని అవని కూడా ప్రణతిని ప్రశ్నిస్తుంది. అయితే ప్రణతి ఇంతవరకు వచ్చిన తర్వాత నిజం దాచడం కరెక్ట్ కాదు. నేను భరత్ ని ప్రేమిస్తున్నాను వదిన భరత్ అంటే నాకు ఇష్టం అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి వదిన ఒకసారి నేను చేసిన తప్పుని మళ్ళీ చేయను. భరత్ అంటే నాకు చాలా ఇష్టం ఇది మీరు అర్థం చేసుకుంటే మంచిది అని ప్రణతి వెళ్లిపోతుంది. అవని టెన్షన్ పడుతూ ఇది ఎన్ని గొడవలకు కారణం అవుతుందో..? నన్ను అందరు అపార్థం చేసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి, భరత్ లు నిజంగానే ప్రేమించుకుంటున్నారు అని తెలుసుకున్న పల్లవి ఇంటికి వెళ్లి పార్వతి తో అత్తయ్య ఆ భరత్ ప్రణతి ఇద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారు. భరత్ అవనితో చెప్పడం నేను విన్నాను అని అంటుంది.. అయితే పార్వతి అవని ఏమంటుంది అని అడుగుతుంది. నాకు తెలిసి అవని అక్కని వాళ్ళిద్దర్నీ దగ్గరుండి కలిసేలా చేసిందేమో అని అనుమానంగా ఉంది అత్తయ్య అని అంటుంది.
మనం మన ప్రణతిని ఇంటికి తెచ్చుకుంటే వాడికి దూరంగా ఉంటే అంతా మర్చిపోతారు అని ఒక ప్లాన్ చెప్తుంది. పార్వతి ఈ ప్లాన్ బాగుంది ఇదే మనం ఫాలో అవుదామని అంటుంది. అటు అవని వీరిద్దరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. స్వరాజ్యం ఈ విషయాన్ని మీ మామయ్యకి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది అని అంటుంది. ఇదంతా నేను చూసుకుంటాను అనుకుంటుంది. ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్న ఆయనకు తెలిస్తే శాశ్వతంగా దూరం అవుతాడు.. ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతుంది.
ఈ విషయం మామయ్యకు ఎలా చెప్పాలి. అని టెన్షన్ పడుతుంది. అప్పుడే అక్కడకు రాజేంద్ర ప్రసాద్ వస్తాడు. అందరు షాక్ అవుతారు. మావయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ప్రణతి భరత్ లు ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు మావయ్య అని అవని చెప్తుంది.. దానికి రాజేంద్రప్రసాద్ ఇష్టపడడం మంచిదే కదా.. నాకు ముందే తెలుసు. ప్రణతిని బాగా చూసుకుంటున్నాడు భరత్.. పెళ్లి గురించి తర్వాత మాట్లాడదాం అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. అటు పల్లవి పార్వతిని రెచ్చగొడుతూ ప్రణతిని మన ఇంటికి తీసుకోవాలి అని అంటుంది.
మన ప్రణతిని మన ఇంటికి తీసుకు రావాలంటే కచ్చితంగా మనం అవనీకి తెలియకుండానే ఇదంతా ప్లాన్ చేయాలి అని అంటుంది. మీరేం టెన్షన్ పడుకున్న అత్తయ్య ఇదంతా నేను చూసుకుంటాను అని పల్లవి అంటుంది. ఇంట్లోని వాళ్ళందరూ మాట్లాడుకోవడం విన్నా అక్షయ్ ఏంటి ఏమైంది ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. మా ఫ్రెండ్కొడుకుది పెళ్లి పెళ్లి పత్రికలు కూడా వేయించారట దాని గురించి మాట్లాడుతున్నామని రాజేంద్ర ప్రసాద్ అబద్ధం చెప్తాడు..
అవని ఎందుకు మామయ్య అబద్ధం చెప్పారు. ఈ విషయం ఎప్పుడో ఒకరోజు తెలియదు కదా అని అంటుంది. ఇప్పుడు తెలుస్తే మేము ఆరోగ్యం జాగ్రత్త కృంగిపోతుంది. కొద్దిరోజులు ఆగిన తర్వాత వాడికి నిజం చెబుతామని అంటాడు. పార్వతి తన కూతురు గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. అత్తయ్య మీరు టెన్షన్ పడకండి ఈ విషయం గురించి మా డాడీకి చెప్పాను. సంబంధం చూశారట రేపు మీ షష్టిపూర్తి ఫంక్షన్ లో ఇది అనౌన్స్ చేద్దామని అంటుంది.
చక్రధర్ ఫోన్ చేయగానే పార్వతి తో ఈ విషయం గురించి మాట్లాడతాడు. ప్రణతిని మీరు అక్కడి నుంచి తప్పు చేస్తారు చెల్లెమ్మ మీరేం పర్లేదు రేపు షష్టిపూర్తి అని అనగానే ఒక మంచి సంబంధాన్ని చూశాను. అప్పుడే అనౌన్స్ చేద్దాం. అని చక్రధర్ అంటాడు.. ప్రణతిని మన ఇంటికి వచ్చేందుకు మనం ప్లాన్ చేద్దాం అని పల్లవి అడుగుతుంది.. ప్లాన్ ఏంటి? ఏంట్రా చేయాలనుకుంటున్నావ్ అని కమల్ పల్లవి తో ఉంటాడు.. ప్లాన్ ఏం లేదు అత్తయ్య గారు షష్ఠిపూర్తిని చేయాలనుకుంటున్నాము. అందుకోసం మావయ్య గారిని అవినీతిని అందరిని పిలవాలని అనుకుంటున్నామని పల్లవి అంటుంది.
Also Read:సురేంద్రకు శృతి స్ట్రాంగ్ కౌంటర్.. మనోజ్ ను చూసి ప్రభావతి షాక్..
అవని వదిన నాన్న మళ్ళీ ఇంటికి వస్తారంటే మేము ఏదైనా చేస్తామని హడావిడి చేస్తారు శ్రీకర్, కమల్. ఈ విషయాన్ని వెంటనే వదిలేసి చెప్పాలని కమల్ ఫోన్ చేస్తాడు. వదిన నీకు గుడ్ న్యూస్ అమ్మ నిన్ను నాన్నని షష్టిపూర్తికి పిలవాలని అనుకుంటుంది. అంటే మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చాయి. మనమందరం కలిసి ఉండే రోజులు వచ్చాయి అని అంటాడు. అదేంటి షష్టిపూర్తి ఏంటి అని అవని అంటుంది. అన్నయ్య బామ్మ అక్కడ చూస్తే మళ్ళీ గొడవ చేస్తుంది. ఈ విషయాన్ని అవని రాజేంద్రప్రసాద్ తో చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..