National Crush:మన ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు రష్మిక మందన్న (Rashmika Mandanna)మాత్రమే.. తన గ్లామర్ తో..నటనతో.. పర్సనల్ లైఫ్ తో.. ఇలా ప్రతి ఒక్క విషయంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మని చాలామంది నేషనల్ క్రష్ అని పిలుచుకుంటూ ఉంటారు.. అంతేకాదు ఈమెకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న ఈ ముద్దుగుమ్మకి ఈ నేషనల్ క్రష్ ట్యాగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా హిట్టే.. అయితే అందరూ నేషనల్ క్రష్ అంటే రష్మికను పిలుచుకుంటే.. తాజాగా ఈ నటుడు మాత్రం నేషనల్ క్రష్ రష్మిక కాదు ఆమెనే అంటూ సోషల్ మీడియాలో చిచ్చు పెట్టారు. ఇక ఆ నటుడు చేసిన కామెంట్లకు రష్మిక ఫ్యాన్స్ కి.. ఆ హీరోయిన్ ఫ్యాన్స్ కి మధ్య గొడవ స్టార్ట్ అయింది. మరి ఇంతకీ ఆ నటుడు రష్మికని కాకుండా ఏ హీరోయిన్ కి నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నేషనల్ క్రష్ ట్యాగ్ పై చిచ్చుపెట్టిన నటుడు..
కన్నడ సినిమా ‘కిర్రిక్ పార్టీ’తో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన రష్మిక మందన్నా.. ఆ తర్వాత ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ కి వచ్చింది. అలా తెలుగులో వరుస సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘పుష్ప’ సినిమా హిట్ తో నేషనల్ క్రష్ ట్యాగ్ సంపాదించుకుంది. అప్పటి నుండి రష్మిక ని అందరూ నేషనల్ క్రష్ అని పిలిస్తున్నారు. అలా చాలా సంవత్సరాల నుండి ఈ ట్యాగ్ రష్మికకే సెట్ అయిపోయింది. కానీ తాజాగా బాలీవుడ్ నటుడు అవినాష్ తివారి (Avinash Tiwary) నేషనల్ క్రష్ రష్మిక కాదు ఆ హీరోయిన్ అంటూ చిచ్చు పెట్టారు. అయితే రీసెంట్ గా అవినాష్ తివారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆయనకు నేషనల్ క్రష్ గురించి ప్రశ్న ఎదురైంది.
రష్మిక కాదు మృణాల్ అంటూ..
ఇక దీని గురించి స్పందిస్తూ.. ఇప్పట్లో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూ మాట్లాడారు.అయితే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది మృణాల్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తూ ఇప్పటినుండి నేషనల్ క్రష్ అంటే రష్మిక కాదు మా హీరోయినే అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. కానీ రష్మిక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వాళ్లు కూడా తిరిగి కౌంటర్ ఇస్తూ..నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఒకరిద్దరూ ఇస్తే వచ్చింది కాదు..సినీ ఇండస్ట్రీ మొత్తం రష్మికకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆమె ముందు మృణాల్ ఎంత అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు రష్మిక యాక్టింగ్ ముందు మృణాల్ పనికిరాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా బాలీవుడ్ నటుడు అవినాష్ తివారి మాట్లాడిన ఒకే ఒక్క మాట సోషల్ మీడియాలో రష్మిక- మృణాల్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది
యానిమల్ విడుదల టైమ్ లో కూడా..
ఏది ఏమైనప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది నటీనటులు మాట్లాడిన మాటలు ఇలా వివాదానికి గురై అభిమానుల మధ్య చిచ్చు పెడుతూ ఉంటాయి. ఇక ఇలాంటి నేషనల్ క్రష్ ట్యాగ్ వివాదం కేవలం మృణాల్ విషయంలోనే కాదు ఆ మధ్యకాలంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ విడుదలైనప్పుడు త్రిప్తి డిమ్రీకి కూడా నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఇచ్చేశారు.. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినప్పటికీ త్రిప్తి డిమ్రీనే ఎక్కువ వైరల్ అవ్వడంతో ఈ సినిమా సమయంలో త్రిప్తికి నేషనల్ క్రష్ ట్యాగ్ కట్టబెట్టారు.
ALSO READ:Tollywood: డైరెక్టర్గా యూటర్న్ తీసుకున్న రామ్ చరణ్ బ్యూటీ.. ఎవరంటే?