Tollywood:కొంతమంది హీరోయిన్లు నటించిన ఒక్క సినిమాతోనే ఫేమస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నేహ శర్మ (Neha Sharma) కూడా ఒకరు.. అలా మోడలింగ్ రంగం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నేహ శర్మ.. రామ్ చరణ్ (Ram Charan) మొదటి సినిమా ‘చిరుత’లో నటించి ఫేమస్ అయింది.అయితే ఈ సినిమాలో నేహా శర్మ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. అలా అటు నేహా శర్మ కి ఇటు రామ్ చరణ్ ఇద్దరికీ కూడా చిరుత మూవీనే మొదటి సినిమా. అలా మొదటి సినిమాతో హిట్ కొట్టిన నేహ శర్మ ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. అయితే తాజాగా నేహ శర్మ కొత్త అవతారం ఎత్తబోతున్నట్టు బీటౌన్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.ఆమె యాక్టింగ్ కి గుడ్ బై చెప్పి మరో రంగంలో స్థిరపడబోతుందట. మరి ఇంతకీ నేహా శర్మ ఏ రంగంలో స్థిరపడాలనుకుంటుంది అనేది చూద్దాం..
హీరోయిన్ గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్న రామ్ చరణ్ హీరోయిన్..
నేహ శర్మ మొహానికి రంగు వేసుకోవడం పక్కనపెట్టి తెర వెనుక డైరెక్షన్ చేయాలని చూస్తుందట. అవును మీరు వినేది నిజమే.. చాలామంది హీరోయిన్లు సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్నాక డైరెక్షన్ రంగంలో,నిర్మాణ రంగంలో రాణించిన వాళ్ళు ఉన్నారు. అలా కొంతమంది హీరోయిన్ గానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా సక్సెస్ అయితే.. మరి కొంతమంది సక్సెస్ కాలేదు. అలా తాజాగా నేహా శర్మ కూడా దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టి మెగా ఫోన్ పట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ఆ చిత్రానికి దర్శకురాలిగా బాధ్యతలు..
ఇక అసలు విషయం ఏమిటంటే.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ (Ajay Devgan) నిర్మాణ సారథ్యంలో 1945 నాటి నేపథ్యంలో సాగిన ఓ పిరియాడికల్ డ్రామా జానర్లో ఒక సినిమా తెరకెక్కబోతుంది.అయితే ఈ సినిమాకి నేహ శర్మ దర్శకత్వం వహించబోతున్నట్టు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు నేహ శర్మ నిజంగానే దర్శకత్వ రంగాన్ని ఎంచుకుందని.. పలువురు బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే అజయ్ దేవగన్ నిర్మాణంలో నేహ శర్మ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది,మోహిత్ రైనా ఇద్దరు కీలకపాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం..ఇక నేహా శర్మ డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
థియేటర్లలో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం..
ఇక మరొక విషయం ఏమిటంటే.. ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. మరి బాలీవుడ్లో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.. నిజంగానే నేహా శర్మ దర్శకత్వ రంగంలోకి అడుగుపెడుతుందా.. దర్శకురాలిగా సక్సెస్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
నేహా శర్మ సినిమాలు..
ఇక నేహా శర్మ సినిమాల విషయానికి వస్తే.. చిరుత మూవీతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో కుర్రోడు సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైపోయింది. అలా బాలీవుడ్లో పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నేహా శర్మ మళ్లీ దర్శకురాలిగా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందట.
ALSO READ:Samantha New Pics : బీ టౌన్‌కు వెళ్లావా.. బీ గ్రేడ్‌కు వెళ్లావా… సమంత ఏంటా ఫోజులు ?