BigTV English

OTT Movie: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

OTT Movie: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

OTT Movie:ఏ చిత్రమైన సరే థియేటర్లలో విడుదలైన నెలలోపు లేదా ఎనిమిది వారాలలోపు కచ్చితంగా ఓటీటీలోకి వచ్చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే అందుకే థియేటర్లలో సినిమా మిస్ అయినవాళ్లు ఓటీటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకి విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఎమోషన్, కామెడీ, యాక్షన్, హారర్, ఫ్యామిలీ ఇలా ఏ జానర్ లో చిత్రాలు కావాలన్నా సరే మనకు ఓటీటీలో లభిస్తాయి. అందుకే చాలామంది ఓటీటీ లనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అటు థియేటర్లలో టికెట్ ధరలు పెరిగిపోతున్న నేపద్యంలో అంత డబ్బు పెట్టి ఒకరే సినిమా చూడడం ఇష్టం లేక ఇంట్లో కుటుంబ సభ్యులతో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకొని మరీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించే ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


శివ కార్తికేయన్ (Siva Karthikeyan) నటించిన మదరాసి, ర్యాన్ రైనాల్డ్స్ ప్రధాన పాత్రలో నటించిన ఇఫ్, నరైన్ హీరోగా నటించిన సాహసం వంటి చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసాయి. మరి ఈ వారం ఏ చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్:


కే ఫర్ కింబాప్..

కొరియన్ వంటకం కింబాప్ చుట్టూ సాగే కథ ఇది. డాక్యుమెంటరీ ఫిల్మ్ గా సెప్టెంబర్ 30వ తేదీన విడుదల అయ్యింది. నామ్ డోహ్ -హ్యాంగ్ ఇందులో ప్రధానంగా కనిపిస్తారు.

ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ -అక్టోబర్ 2

మాన్స్టర్ ది ఎడ్ గీన్ స్టోరీ -అక్టోబర్ 3

స్టీవ్ -అక్టోబర్ 3

ఇఫ్ -అక్టోబర్ 3

ప్రైమ్ వీడియో:

మదరాసి:
శివ కార్తికేయన్ హీరోగా.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా.. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన చిత్రం మదరాసి.విద్యుత్ జమ్వాల్ కీలక పాత్ర పోషించారు. ఫ్రెగోలి డిల్యూషన్ అనే సమస్యతో బాధపడుతున్న వ్యక్తి తమిళనాడులో తుపాకులను సరఫరా చేసే సిండికేట్ ను ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు. అనే కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

ప్లే డర్టీ:

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కాబోతోంది. బ్రిటిష్ కమాండోలు ఇటాలియన్ సైనికుల వేషంలో జర్మన్ ఆయిల్ డిపోను ధ్వంసం చేయడానికి చేసే ఆపరేషన్ చుట్టూ ఈ కథ సాగుతుంది.

సన్ నెక్స్ట్:

సాహసం:

నరైన్ బాబు, ఆంటోనీ, గౌరీ జి కిషన్, రంజాన్ మహమ్మద్, అజు వర్గీస్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం సాహసం. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ఎదురయ్యే సవాళ్లను ఈ సినిమా చూపిస్తుంది.. అక్టోబర్ 1 నుండి డిజిటల్ ప్రీమియర్ కి రాబోతోంది.

ALSO READ:Mahima Nambiar: ఇదే చివరి హెచ్చరిక.. కఠిన శిక్ష తప్పదంటూ హీరోయిన్ వార్నింగ్!

Related News

OTT Movie : ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్తే గ్యాంగ్ స్టర్ తగిలాడు… కిక్కెక్కించే మలయాళ లవ్ స్టోరీ

OTT Movie : ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్ప్పుకోలేదని… ‘వోల్ఫ్’ ఎంట్రీతో ఊహించని టర్న్ … గిలిగింతలు పెట్టే మలయాళ క్రైమ్ కామెడీ

Junior movie OTT: సైలెంట్ గా మరో ఓటీటీలోకి వచ్చిన జూనియర్.. ఇక్కడి పరిస్థితేంటో ?

OTT Movie : అప్పు కట్టలేదని కన్నపిల్లల కళ్ళముందే ఘోరంగా… మనసును మెలిపెట్టే ఫీల్ గుడ్ స్టోరీ

OTT Movie : భర్త ఉండగానే భార్యపై అఘాయిత్యం… ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికి… ఈగోను సాటిస్ఫై చేసే రివేంజ్ భయ్యా

OTT Movie : కూతురి ఫోన్లో అలాంటి వీడియోలు… తండ్రి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ భయ్యా

OTT Movie : భర్త చేతగానితనం… భార్యపై కన్నేసే మరిది… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

Big Stories

×