BigTV English

Rajamouli: బయటపడ్డ రాజమౌళి కొత్త సెంటిమెంట్.. హీరోల మెడలో ఆ లాకెట్ ఉండాల్సిందేనా?

Rajamouli: బయటపడ్డ రాజమౌళి కొత్త సెంటిమెంట్.. హీరోల మెడలో ఆ లాకెట్ ఉండాల్సిందేనా?

Rajamouli: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ పేరు తెచ్చుకున్న రాజమౌళి (Rajamouli ) ఇప్పుడు తన సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నారు. ‘శాంతినివాసం’ అనే సీరియల్ తో ఎపిసోడ్ డైరెక్టర్ గా మొదలైన ఆయన డైరెక్షన్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ (James Cameron) లాంటి దర్శకులు కూడా రాజమౌళి డైరెక్షన్ పై ప్రశంసలు కురిపించారు అంటే.. ఇక ఈయన పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


సెంటిమెంట్ ఫాలో అవుతున్న సెలబ్రిటీలు..

ఇకపోతే సాధారణంగా ఎవరికైనా సరే ఒక సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు (Mahesh Babu) తన సినిమా రిలీజ్ కి ముందు.. తన తల్లి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమెతో కాఫీ తాగి.. ఆ తర్వాతే తన సినిమాను రిలీజ్ చేసేవారట. ఇక అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా తనకు ఇష్టమైన దేవాలయంలోనే తాను చేసే సినిమా స్క్రిప్ట్ మొదలు పెడతానని గతంలో చెప్పుకొచ్చారు.


తెరపైకి రాజమౌళి కొత్త సెంటిమెంట్..

ఇప్పుడు రాజమౌళి కొత్త సెంటిమెంట్ కూడా తెరపైకి వచ్చింది. దీనికి కారణం ఈరోజు రాజమౌళి తాను దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ మూవీ నుంచి రిలీజ్ చేసిన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టరే కారణం అని చెప్పవచ్చు. తాజాగా మహేష్ బాబు తో రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ వదలలేదు. అయితే ఈరోజు మహేష్ బాబు 50వ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 మూవీ నుంచి మహేష్ బాబు ఫేస్ రివీల్ చేయకుండా.. ఆయన మెడలో ఉన్న లాకెట్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ లాకెట్ బాగా వైరల్ గా మారింది.

రాజమౌళి డైరెక్షన్ అంటే హీరో మెడలో ఆ లాకెట్ ఉండాల్సిందేనా?

ఈ లాకెట్లో ఆ పరమశివుడికి సంబంధించిన నందీశ్వరుడు, ఢమరుకం , త్రిశూలం, విభూది బొట్లతో డిజైన్ చేసిన లాకెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ లాకెట్ వైరల్ అవ్వడంతో గతంలో రాజమౌళి సినిమాలలో హీరోలు ఉపయోగించిన లాకెట్లు కూడా వైరల్ గా మారాయి. అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో శివలింగంతో కూడిన లాకెట్ ప్రభాస్ ధరించారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్(Ram Charan) మెడలో ఓం లాకెట్ మనం చూడవచ్చు. ఇప్పుడు మహేష్ బాబు మెడలో కూడా ఇలా శివుడికి సంబంధించిన లాకెట్ ఉంది.

పరమశివుడి సెంటిమెంటుతో జక్కన్న..

ఇలా ఈ ముగ్గురు హీరోలకి, వారు ధరించిన లాకెట్లకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో.. రాజమౌళికి శివుడి సెంటిమెంట్ చాలా ఎక్కువ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అందుకే తాను దర్శకత్వం వహించే సినిమాలలో హీరోల మెడలో ఆ పరమశివుడికి సంబంధించిన వస్తువులతో తయారు చేసిన లాకెట్ ను వేస్తున్నారు అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి కొత్త సెంటిమెంట్ తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ALSO READ:Spirit Villain : స్పిరిట్ దిమ్మతిరిగే ట్విస్ట్… ప్రభాస్‌కు విలన్ సందీప్ రెడ్డి వంగనే ?

Related News

Bad Girlz : స్టేజ్‌పైనే బట్టలు విప్పేసిన హీరోయిన్లు… వామ్మో అసలు వీళ్లకు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Samantha: మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ స్టెప్పులు వేయనున్న సమంత.. తగ్గట్లేదుగా?

Film industry: ఏంటీ.. ఈ హీరోయిన్ స్కూల్ లో ఉన్నప్పుడే హీరోయిన్గా చేసిందా?

SSMB29 Firts Look: ఓర్నీ రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడు కదా… ఏకంగా పవన్‌ కళ్యాణ్‌నే టచ్ చేశాడు

Spirit Villain : స్పిరిట్ దిమ్మతిరిగే ట్విస్ట్… ప్రభాస్‌కు విలన్ సందీప్ రెడ్డి వంగనే ?

Big Stories

×