Spirit Villain : స్పిరిట్ (Spirit).. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో ‘స్పిరిట్’ సినిమా ప్రకటించారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నిజానికి ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. మొదట ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే (Deepika Padukone) ను హీరోయిన్ గా ఎంచుకున్నారు సందీప్ రెడ్డి వంగ. కానీ ఆమె పెట్టిన కండిషన్స్ కి ఆమెను తప్పించి ‘యానిమల్’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన తృప్తి డిమ్రీ (Tripti dimri) ని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఈ కారణంతో అటు సందీప్ ఇటు దీపికా మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగిన విషయం తెలిసిందే.
స్పిరిట్ మూవీలో విలన్ సందీప్ వంగానా?
ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నారు సందీప్ రెడ్డి వంగ. మరి ఈ సినిమాలో ఎవరు విలన్ గా నటించబోతున్నారు? అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న కారణంగా.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ రెడ్డివంగా కి స్పిరిట్ మూవీ విలన్ ఎవరు? అంటూ పెద్ద ఎత్తున అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తం అయ్యాయి. దీంతో స్పిరిట్ మూవీలో “నేనే విలన్” అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు సందీప్ రెడ్డి వంగ.
నిజమా? లేక కామెడీ చేశారా?
ఇప్పటివరకు తన కథలతో, డైరెక్షన్ తో, మేకోవర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే నిజంగానే సందీప్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారా? లేక కామెడీ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే సందీప్ నటన.. అందులోనూ ప్రభాస్ కి పోటీగా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఆసక్తి కనబరిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలు..
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ‘బాహుబలి’ తర్వాత అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నారు. చివరిగా కల్కి 2898AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాలతో పాటు సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. మొత్తానికైతే ఒక సినిమా తర్వాత మరొక సినిమా ప్రకటిస్తూ అభిమానులలో అంచనాలు పెంచేస్తున్నారు ప్రభాస్.
ALSO READ:SSMB 29: మహేష్ బర్తడే స్పెషల్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న!