Krishna Master: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ (Krishna Master) ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈయనపై పోక్సో కేసు నమోదయింది. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అప్పటినుంచి అజ్ఞాతంలో ఉన్న కృష్ణని పోలీసులు గుర్తించారు. బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు నిర్ధారించుకొని, అక్కడికి వెళ్లి మరీ అరెస్టు చేశారు. గతంలో ఇన్ స్టా ద్వారా యువతులను కూడా మోసం చేసినట్లు ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ల పైనే ఇలాంటి కేసులు నమోదవుతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అన్నయ్య ఇంట్లో తలదాచుకున్న కృష్ణ మాస్టర్..
ఇదిలా ఉండగా తనపై కేసు నమోదు అయిందని తెలిసిన వెంటనే కృష్ణ మాస్టర్ బెంగళూరులో ఉన్న తన అన్నయ్య ఇంటికి వెళ్లిపోయారు. అక్కడే తలదాచుకున్నారట. కానీ హైదరాబాద్ పోలీసులు వినూత్న టెక్నాలజీని ఉపయోగించి బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి మరీ అక్కడికి వెళ్లి కృష్ణ మాస్టర్ ను అరెస్టు చేశారు.
పెళ్లి చేసుకున్న కృష్ణ మాస్టర్..
ఇకపోతే కృష్ణ కి ఇటీవలే ఒక మహిళతో వివాహమైందని సమాచారం . ముఖ్యంగా తన భార్యకు సంబంధించిన రూ.9.50 లక్షల నగదును తీసుకొని కృష్ణ వెళ్లిపోయాడని తెలుస్తోంది.
ఇంస్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలకి వేధింపులు..
ఇకపోతే ఇంస్టాగ్రామ్ ను ఆయుధంగా మార్చుకున్న కృష్ణ మాస్టర్ పలువురు యువతులను, మహిళలను మోసం చేసినట్లు ఈయనపై అభియోగాలు ఉన్నాయి.
కృష్ణ మాస్టర్ కెరియర్..
కృష్ణ మాస్టర్ కెరియర్5విషయానికి వస్తే.. డాన్సర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈయన.. ఢీ డాన్స్ సీజన్స్ లో పాల్గొన్నారు. సూపర్ జోడిలో రన్నరప్ గా నిలిచిన ఈయన డాన్స్ ఐకాన్ లో విన్నర్ గా గెలిచారు.
కృష్ణ మాస్టర్ కొరియోగ్రఫీ గా పని చేసిన సినిమాలు..
ఇక ఈయన మట్కా సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారి పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు.
ALSO READ:Rajinikanth: అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్న రజినీకాంత్.. స్నేహితుడే అంటూ!