Udaipur Files movie: సాధారణంగా ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అంటే కచ్చితంగా సెన్సార్ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ సెన్సార్ సభ్యులు సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించి, ఉంటే ఆ తర్వాత కొన్ని కట్స్ చెబుతూ ఉంటారు. వారి సలహా మేరకు అన్ని పాటించిన తర్వాతనే ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది. అలా సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న సినిమాలు మాత్రమే థియేటర్లలో విడుదలవుతూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. త్వరలో విడుదలకు సిద్ధం కాబోతున్న ఒక సినిమాకి సెన్సార్ సభ్యులు ఏకంగా 150 కట్స్ చెప్పారట. దీనికి తోడు హైకోర్టు సైతం ఈ సినిమా విడుదలను ఆపివేయాలని చెప్పింది. కానీ చిత్ర బృందం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదల ఆపేదే లేదు అంటూ భీష్ముంచుకు కూర్చున్నారట. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఉదయ్ పూర్ ఫైల్స్ పై హైకోర్టు స్టే..
అసలు విషయంలోకి వెళ్తే.. రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ ఉదయ్ పూర్ ఫైల్స్’ . ఇప్పుడు ఈ సినిమా వివాదాలలో చిక్కుకుంది. జూలై 11 2025న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా నుండి సెన్సార్ నిర్వాహకులు ఏకంగా 150 సీన్స్ తొలగించారు.అంతేకాదు ఈ సినిమా విడుదలను ఆపివేయాలని హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే.. ఉదయపూర్ లో టైలర్ కన్హయ్యా లాల్ అనే వ్యక్తిని కొంతమంది హత్య చేశారు . అందుకు సంబంధించి ఉదయ్ పూర్ ఫైల్స్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. పైగా రిలీజ్ కి ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనిపై నిర్మాత సుప్రీంకోర్టుకు అయిన వెళ్లడానికి సిద్ధమే కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఈ సినిమా విడుదలను ఆపము అంటూ తెలిపారు.
మరో వివాదంలో చిక్కుకున్న ఉదయ్ పూర్ ఫైల్స్..
ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది.. తాజాగా ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ సినిమా విడుదలను ఆపివేయాలి అని జమాతే ఇ ఇస్లామి డిమాండ్ చేసింది. ఈ సినిమా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని, ఇది విడుదల అయితే శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశం ఉందని వారు తెలిపారు. మరొకవైపు సమాజ్ వాదీ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే అబూ అజ్వీ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ సినిమా ట్రైలర్ ను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయన కోరారు.
సినిమా నేపథ్యం ఏమిటంటే..?
ఉదయపూర్ ఫైల్స్ మూవీ అంతా కన్హయ్య లాల్ హత్య కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు సమాచారం. 2022 జూన్ 28న ఇద్దరు దుండగులు కన్హయ్య లాల్ దుకాణంలోకి కస్టమర్లుగా నటిస్తూ ప్రవేశించారు. వారిలో ఒకరికి కన్హయ్యా లాల్ కొలతలు తీసుకుంటుండగా..వెంటనే మరొకరు అతనిని కత్తితో దాడి చేసి తల నరికేశారు. అంతేకాదు ఈ ఘటన మొత్తాన్ని కెమెరాలు చిత్రీకరించి ఆ వీడియోని ఆన్లైన్లో ప్రసారం చేశారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా మతానికో, విశ్వాసానికో సంబంధించింది కాదని.. సత్యం, భావజాలం గురించి మాత్రమే అని మేకప్ ప్రకటించారు. ఇక ఇందులో దుగ్గల్, రజనీష్ , ప్రీతి ఘాంగియాని, కమలేష్ , సావంత్, ముస్తాక్ ఖాన్, కంచి సింగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ALSO READ:Kaushal Manda: నేను హీరో కాకుండా తొక్కేశారు. వామ్మో..ఇంత పెద్ద కుట్ర జరిగిందా?