E-Paper
Advertisement

Akhanda 2 : వారణాసిలో అఖండ 2 ఈవెంట్? ఇదెక్కడి మాస్ బోయా

Akhanda 2 : వారణాసిలో అఖండ 2 ఈవెంట్? ఇదెక్కడి మాస్ బోయా
Advertisement

Akhanda 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. సింహ సినిమాతో మొదలైన ఈ కాంబినేషన్ మొన్న వచ్చిన అఖండ వరకు అద్భుతమైన సక్సెస్ లు సాధించింది. ఈ కాంబినేషన్స్ లో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇక ప్రస్తుతం వీరి కాంబినేషన్లో అఖండ 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను డిసెంబర్ 5వ తారీఖున ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా అదే లెవెల్ లో చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు.

వారణాసిలో ఈవెంట్ 

Advertisement

అఖండ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది కాబట్టి ముంబై ఆడియన్స్ కు ఈ సినిమాను మరింత చేరువు చేయడానికి వారణాసిలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా యోగి ఆదిత్యానంద ను తీసుకొచ్చే ప్లానింగ్ కూడా ఉంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఈ సినిమాకి సంబంధించి మొదటి సింగిల్ సాంగ్ ముంబై వేదికగా విడుదల చేశారు. ఆ సాంగ్ కు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత వైజాగ్ లో కూడా దీనికి సంబంధించి ఈవెంట్ చేశారు. బెంగళూరులో కూడా ఈ సినిమా ఈవెంట్ చేశారు. త్వరలో హైదరాబాదులో ఈవెంట్ చేయనున్నారు.

ముఖ్యఅతిథిగా సీఎం 

Advertisement

ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. అలానే బ్రేక్ ఈవెంట్ కావాలన్నా కూడా మంచి కలెక్షన్స్ రావాల్సిందే. అఖండ సినిమా సక్సెస్ సాధించింది కాబట్టి ఈ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. అయితే బాలకృష్ణ మరోవైపు పొలిటీషియన్ కూడా కాబట్టి ఈ సినిమాకి రాజకీయ నాయకుల్ని గెస్ట్లుగా ఆహ్వానిస్తున్నారు.

హైదరాబాదులో జరగబోయే ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వారణాసి ఈవెంట్ కు యోగి ఆదిత్యనాథ్ ఇలా మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రిని తీసుకొస్తున్నారు.

Also Read: Prabhas : ప్రభాస్ దర్శకులు అందరూ ప్రామిస్ లు చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×