E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. దిల్ రాజు స్కెచ్ మామూలుగా లేదుగా!

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. దిల్ రాజు స్కెచ్ మామూలుగా లేదుగా!
Advertisement

Dil Raju Pawan:పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు మళ్లీ సినిమా చేయబోతున్నాడా అంటే, అవుననే సమాధానం వినిపిస్తుంది. స్వయంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా ‘రామాయణం’ సినిమా ప్రెస్ మీట్స్‌లో పాల్గొన్న ఆయన, గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తాను నిర్మించిన ‘వకీల్ సాబ్’ సినిమాను గుర్తు చేసుకుంటూ, మరోసారి పవన్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ మధ్య దిల్ రాజు, పవన్ కళ్యాణ్‌ను కలవడంతో ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ చక్కర్లు చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే విషయంపై మీడియా అడగ్గా దిల్ రాజు మాట్లాడుతూ ఒక నిర్మాతగా గతంలో ‘వకీల్ సాబ్’ లాంటి సినిమా తీసానని,ఇపుడు మరో సినిమా తీద్దామనే కలిసి ఆయన్ని కలిసినట్టు అసలు విషయం చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్‌తో మరో మంచి సినిమా చేయాలనే విషయంలో తనకు పూర్తి క్లారిటీ ఉందని, అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నానని దిల్ రాజు తెలిపారు. కాకపోతే కథ, దర్శకుడు, ఇతర వివరాలు అన్నీ పక్కాగా సెట్ అయిన తర్వాతే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తానని చెప్పారు.

ఇదే సమయంలో ‘ఓజీ 2’ సినిమా దిల్ రాజు బ్యానర్‌లోకి వస్తుందా అని కూడా అడగ్గా పవన్‌తో మరో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే కలిశానని మాత్రమే చెప్పారు. దీంతో ‘ఓజీ 2’పై క్లారిటీ రాకపోయినా, పవన్ – దిల్ రాజు కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ ఉండబోతుందన్న వార్త మాత్రం ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపిందనే చెప్పాలి.

Advertisement

మరోవైపు తనకు ‘సంక్రాంతి రాజు’ అనే పేరు ఎలా వచ్చిందో చెబుతూ కెరీర్ మొదట్లో తనను అందరూ ‘సమ్మర్ రాజు’ అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే ‘దిల్’, ‘ఆర్య’, ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’ లాంటి సూపర్ హిట్ సినిమాలన్నీ సమ్మర్ లోనే రిలీజ్ అయ్యాయని చెప్పారు. ఆ తర్వాత సంక్రాంతికి వరుసగా సినిమాలు రావడం, అవి పెద్ద హిట్లు కావడంతో ‘సంక్రాంతి రాజు’ అనే ట్యాగ్ ఫిక్స్ అయిపోయిందన్నారు.

అయితే ఇలాంటి పేర్లు, బిరుదులు అన్నీ శాశ్వతం కాదని తన మనసులోని మాటని బయటపెట్టారు ఒకప్పుడు తనను ‘గోల్డెన్ హ్యాండ్’ అని పిలిచేవారని, ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు ఎప్పుడూ మారుతూ ఉంటాయని, పరిస్థితులను బట్టి జనాలు, మీడియా రకరకాల పేర్లు పెడుతుంటారని చెప్పారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే తన మనసులో మాటను దిల్ రాజు బయటపెట్టడంతో ఈ కాంబినేషన్‌పై మళ్లీ అంచనాలు మొదలయ్యాయనే చెప్పాలి. చూడాలి మరి దిల్ రాజు ఆశపడుతునట్టుగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎప్పుడు డేట్స్ ఇస్తాడో !

ALSO READ :అందాల డోస్ పెంచేసిన రియా.. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కించేసిందిగా!

Tags

Related News

అందాల డోస్ పెంచేసిన రియా.. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కించేసిందిగా!

నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని…మొదటి సినిమా హీరో ఎవరో తెలుసా?

రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా? ఎందుకంత స్పెషల్ అంటే?

డబ్బు పవర్ అంటే ఇదేనేమో.. ఇట్లు అర్జున కోసం క్యూ కట్టేసిన టాలీవుడ్‌!

‘రియాలిటీ’ లో రఘుకుల తిలకా రారా సాంగ్..కిరణ్ అబ్బవరం క్లారిటీ!

కవ్వించే ఫోజులతో గిలిగింతలు పెడుతున్న మెగా డాటర్ నిహారిక!

‘స్వాభిమానం’ పద్ధతిలో అనిరుధ్ – కావ్య పెళ్లి? దీని ఆంతర్యం ఏంటంటే?

Big Stories

Advertisement
×