BVS Ravi:ఒకప్పుడు దేవుడి బ్యాక్ డ్రాప్ లో ,పురాణ,ఇతిహాసాల నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరించిన సంగతి తెలిసిందే.అయితే కాల క్రమంగా వేరే వేరే జానర్స్ లో సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేయగా ఇపుడు మళ్ళీ పురాణ,ఇతిహాసాలని ఆధారంగా చేసుకుని మళ్ళీ సినిమాలు తీసే పనిలో పడ్డారు మేకర్స్.మరీ ముఖ్యంగా రామాయణం, మహాభారతం లాంటి కథలను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ఎంతో క్యూరియాసిటీ చూపిస్తున్నారు .
అయితే చిన్నప్పటి నుండి మనం వింటూ పెరిగిన కథలే అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యాక డ్రాప్ లో సినిమాలు వస్తే ఆడియన్స్ ఎందుకు ఎగబడి చూస్తున్నారు అనే విషయం పై ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బీవీఎస్ రవి ఇలా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.
ఎలా చెబుతున్నారన్నదే ముఖ్యం
బీవీఎస్ రవి మాట్లాడుతూ రామాయణం, మహాభారతం లాంటి కథల్లో అసలు విషయం కథలో ఉండదని, దాన్ని ఎలా చెబుతున్నారన్నదే ముఖ్యమని అన్నారు. చిన్నప్పుడు తాతయ్య, నానమ్మ చెప్పిన కథలనే ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుందని ఎగ్జాంపుల్ గా చెప్పుకొచ్చారు.ఇక ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారని, చెప్పే విధానం, మాటలు, భావోద్వేగాలు మారితే అదే కథ కొత్తగా అనిపిస్తుందని వివరించారు.ఇక సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతుందని చెప్పారు.
రాముడు అంటే అందరికీ ఎందుకంత ఇష్టం?
ఇక రాముడు కేవలం ఒక దేవుడిగానే కాకుండా మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచాడని, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేయడం, కుటుంబానికి విలువ ఇవ్వడం, భార్యను కాపాడుకోవడం, సోదరుల మధ్య ప్రేమ ఉండటం వంటి ఎన్నో విషయాలు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు .
అందుకే ఎన్ని సంవత్సరాలు గడిచినా రామాయణం కథకు ఇప్పటికీ ఆడియన్స్ లో క్రేజ్ తగ్గటం లేదని అన్నారు. ఇక రామాయణం ప్రభావంతోనే భజనలు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు వంటి ఎన్నో కళలు జనాల్లో పుట్టుకొచ్చాయని వివరించారు.
హనుమాన్ భక్తి సినిమానా? సూపర్ హీరో సినిమానా?
ఇక తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా గురించి మాట్లాడుతూ హనుమాన్ భక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా భక్తి సినిమాగా చూడకూడదని, సూపర్ హీరో సినిమాగా చూడాలని తన అభిప్రాయాన్నిచెప్పుకొచ్చారు. దేవుడి బ్యాక్ డ్రాప్ ఉన్నంత మాత్రాన అది భక్తి సినిమా అయిపోదని,ఆ ఆ కథను ఎలా చూపిస్తున్నాం? ప్రేక్షకుడు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నాడనేదే ముఖ్యమని వివరించాడు ఈ క్రేజీ సీనియర్ ఫిలిమ్ మేకర్ .
ALSO READ :టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!