E-Paper
Advertisement

కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడి సినిమాలే ఆదుకున్నాయా? బీవీఎస్ రవి ఏమన్నారంటే!

కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడి సినిమాలే ఆదుకున్నాయా? బీవీఎస్ రవి ఏమన్నారంటే!
Advertisement

BVS Ravi:తెలుగు సినిమాలలో పురాణ ,ఇతిహాసాల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు.అయితే మధ్యలో లవ్ ,రొమాన్స్, హారర్, మాస్ అంటూ వివిధ జానర్స్ లో సినిమాలు వచ్చినప్పటికీ ఇపుడు మళ్ళీ దేవుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల వైపే ,మేకర్స్ ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.

ముఖ్యంగా వేర్వేరు జానర్స్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతుంటే దేవుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూల్లని కొల్లగొడుతున్నాయి.దీంతో ఈ మధ్య కాలంలో డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసే మేకర్స్ ఎక్కువైపోయారు.ఇక బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టాలంటే దేవుడి సినిమాలే తీయాలా అన్న ప్రశ్నకి బీవీఎస్ రవి ఇలా తనదైన శైలిలో సమాధానాలు చెప్పుకొచ్చాడు.

Advertisement

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే సినిమాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయని చెప్పారు. స్టార్ హీరోల సినిమాలు, భక్తి సినిమాలు, హారర్ సినిమాలకు ఎప్పుడూ ఓక్ సెపరేట్ ఆడియన్స్ ఉంటారని, మంచి కథతో వస్తే ఈ మూడు జానర్ల సినిమాలు థియేటర్లలో బాగా ఆడే అవకాశం ఉంటుందని వివరించారు.

ఇక తెలుగు సినిమా చరిత్రను చూస్తే 1931లో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమా నుంచే భక్తి సినిమాల ప్రయాణం మొదలైందని, అప్పటి నుంచి ఎన్నో పౌరాణిక, భక్తి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయని వివరించారు. ముఖ్యంగా భక్త ప్రహ్లాదలో భక్తితో పాటు తండ్రి కొడుకుల మధ్య గొడవ, తల్లి బాధ, కుటుంబ ఎమోషన్స్ కూడా ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని తనదైన శైలిలో విశ్లేషించారు.

Advertisement

అలాగే మాయాబజార్ సినిమా గురించి మాటలాడుతూ శశిరేఖ పరిణయం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని పాత్రలు, సన్నివేశాలను సినిమా కోసం కొత్తగా సృష్టించారని వివరించారు. ఇక పౌరాణిక సినిమాల గురించి మాట్లాడితే ఎన్టీఆర్ పేరును మర్చిపోలేమని అన్నారు. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు ఎన్టీఆర్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు.

మరోవైపు 1980ల్లో భక్తి సినిమాలు ఎక్కువగా రావడానికి అప్పటి సమాజ పరిస్థితులు కూడా ఒక కారణమని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో సరిగ్గా ఉద్యోగాలు దొరికేవి కావని,ఇక ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేదని ,ఇక ఎన్నో కుటుంబ సమస్యలతో సతమత మయ్యేవారని, అందుకే ఆ రోజుల్లో దేవుడిని నమ్మేవారని,ఆ ప్రభావం సినిమాల్లో కూడా కనిపించిందని చెప్పారు.

ఇక కాలాన్ని బట్టి భక్తి ట్రెండ్ కూడా మారుతూ వచ్చిందని . ఒకప్పుడు ఆంజనేయస్వామి భక్తి, ఆ తర్వాత అయ్యప్ప దీక్షలు, సాయిబాబా భక్తి ఎక్కువగా కనిపించాయని చెప్పారు. 1991 తర్వాత సాయిబాబా పేరు మీద వ్యాపార సంస్థలు, హోటళ్లు పెట్టడం కూడా ఎక్కువైందని తనదైన శైలిలో విశ్లేషించారు.

2004 తర్వాత రియల్ ఎస్టేట్ లలో వాస్తు వంటి వాటి మీద ఫోకస్ ఎక్కువ కావడంతో వినాయకుడికి మొక్కడం ఎక్కువైపోయిందని,ఇక చాగంటి ,గరికపాటి వంటి వారి వల్ల ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ మందికి చేరాయని వివరించారు.మొత్తానికి సమాజంలో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగినప్పుడు ప్రజలు దేవుడిపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు  .బాక్సాఫీస్ వద్ద కూడా హనుమాన్ ,రామాయణం, కార్తికేయ2 వంటి ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి కూడా ఇదొక కారణం అని,అందుకే ఈ జానర్ లో మేకర్స్ సినిమాలు తీసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారని  వివరించారు బీవీఎస్ రవి.

ALSO READ :టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

Tags

Related News

కథ తెలిసినా రామాయణం ఎందుకు బోర్ కొట్టదు? బీవీఎస్ రవి చెప్పిన సింపుల్ సీక్రెట్!

టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. దిల్ రాజు స్కెచ్ మామూలుగా లేదుగా!

అందాల డోస్ పెంచేసిన రియా.. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కించేసిందిగా!

నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని…మొదటి సినిమా హీరో ఎవరో తెలుసా?

రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా? ఎందుకంత స్పెషల్ అంటే?

డబ్బు పవర్ అంటే ఇదేనేమో.. ఇట్లు అర్జున కోసం క్యూ కట్టేసిన టాలీవుడ్‌!

Big Stories

Advertisement
×