E-Paper
Advertisement

టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!
Advertisement

Dil Raju Toxic:‘టాక్సిక్’ సినిమా తో దిల్ రాజు కి చాలా నష్టం వచ్చిందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి .వేరే వేరే సినిమాలకి వచ్చిన లాభాలతో ఆ నష్టాలని కవర్ చేసుకుంటున్నారంటూ చెడుగుడు ఆడేశారు ట్రోలర్స్. అయితే తాజాగా ఈ గాసిప్స్ పై తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ అసలు లెక్కల్ని బయట పెట్టారు దిల్ రాజు.

ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయనకు, ఈ మధ్య వచ్చిన రెండు పెద్ద హిట్లు పాత నష్టాలను కవర్ చేయడానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి అన్న ప్రశ్న కి సమాధానమిస్తూ సినిమా వ్యాపారం అనేది ఒక నెలకు సంబంధించిన లెక్క కాదని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఏదో ఒక నెలలో వచ్చిన హిట్లు, ఫ్లాపులను బట్టి ఒక నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ పరిస్థితిని అంచనా వేయలేమని, ఇండస్ట్రీలో 12 నెలల పూర్తి క్యాలిక్యులేషన్ ఉంటుందని చెప్పారు. ప్రతి నెలా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయని, ఏడాది చివర్లో బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడే దేనివల్ల లాభం వచ్చింది, దేనివల్ల నష్టం జరిగింది అనే అసలు విషయం బయటపడుతుందని వివరించారు.

డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో సినిమాలని సెలెక్ట్ చేస్కోవడం,దాన్ని సరైన ధరకి కొనుక్కోవడం చాలా ముఖ్యమని దిల్ రాజు తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.ఒక సినిమా సూపర్ హిట్ అయినంత మాత్రాన పెట్టిన డబ్బంతా వెనక్కి వచ్చేస్తుందని అనుకోవడం పొరపాటన్నారు

Advertisement

. ఉదాహరణకు పది కోట్ల బిజినెస్ చేసే సినిమాను 11 కోట్లకు కొంటే, ఆ సినిమా హిట్ అయినా సరే కొన్న వ్యక్తికి కోటి రూపాయల నష్టం తప్పదని చెప్పారు. అందుకే సినిమా హిట్టా, ఫ్లాపా అనే దానికంటే ఎంత ధరకు కొన్నాం, ఎంత వసూలు చేసింది అనే లెక్కలే అసలైనవని వివరించారు.

ఇక ‘టాక్సిక్’ సినిమా నష్టాలపై వస్తున్న రూమర్స్ పై రియాక్ట్ అవుతూ ఈ సినిమా వల్ల తనకు మొత్తం నష్టం వచ్చేసినట్లు బయట పెయిడ్ ప్రమోషన్లు జరుగుతున్నాయని నిజానికి తాను ‘టాక్సిక్’ సినిమాను, అలాగే ‘రామాయణం’ సినిమాను కేవలం డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేశానని చెప్పారు. ఈ రెండు సినిమాల విషయంలో తనకు ఎలాంటి నష్టం రాలేదని, డిస్ట్రిబ్యూషన్ పనికి సంబంధించి తనకు రావాల్సిన కమిషన్ పర్సంటేజ్ పక్కాగా వచ్చిందని కుండ బద్దలు కొట్టేశారు.

ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే నెంబర్లకు, అసలు బిజినెస్ లెక్కలకు ఏమాత్రం సంబంధం ఉండదని అసలు విషయం చెప్పుకొచ్చారు. ఎవరికి తోచినట్లు వాళ్లు భారీ లాభాలనో, భారీ నష్టాలనో ప్రచారం చేయడం ఇప్పుడు కామన్ అయిపోయిందని చెప్పారు. తన టీమ్ ఇలాంటి వార్తలన్నీ తన దృష్టికి తీసుకొస్తుందని, కానీ ఇన్నేళ్ల అనుభవం తర్వాత ప్రతి కామెంట్‌ను తాను సీరియస్‌గా తీసుకోనని తెలిపారు.

ఇక తాను ‘టాక్సిక్’ సినిమా రైట్స్ ని కొన్నట్టు ఎక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. అడ్వాన్స్, కమిషన్, కొనుగోలు మధ్య ఉన్న డిఫరెంట్స్ తెలీకుండా వచ్చే గాసిప్స్ ని అసలు పట్టించుకోవద్దని తేల్చి చెప్పారు.మొత్తంగా టాక్సిక్ విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్ కి దిల్ రాజు ఇచ్చిన కౌంటర్ ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది.

ALSO READ :పవన్ కళ్యాణ్‌తో సినిమా.. దిల్ రాజు స్కెచ్ మామూలుగా లేదుగా!

Tags

Related News

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. దిల్ రాజు స్కెచ్ మామూలుగా లేదుగా!

అందాల డోస్ పెంచేసిన రియా.. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కించేసిందిగా!

నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని…మొదటి సినిమా హీరో ఎవరో తెలుసా?

రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా? ఎందుకంత స్పెషల్ అంటే?

డబ్బు పవర్ అంటే ఇదేనేమో.. ఇట్లు అర్జున కోసం క్యూ కట్టేసిన టాలీవుడ్‌!

‘రియాలిటీ’ లో రఘుకుల తిలకా రారా సాంగ్..కిరణ్ అబ్బవరం క్లారిటీ!

కవ్వించే ఫోజులతో గిలిగింతలు పెడుతున్న మెగా డాటర్ నిహారిక!

Big Stories

Advertisement
×