Rhea Chakraborty:రియా చక్రవర్తి..టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా పరిచయమున్న ఈ ముద్దుగుమ్మ ఇపుడు మరోసారి తన స్టైలిష్ లుక్ తో సోషల్ మీడియాలో మంటలు పెట్టేస్తుంది.మాములుగానే ఎప్పటికప్పుడు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో పాటు ప్యాషన్,ఫోటో షూట్స్ కి సంబంధించిన అప్ డేట్స్ ని అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి.
ముఖ్యంగా ఇందులో రియా ధరించిన పింక్ కలర్ అవుట్‌ఫిట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.ఇక ఈ ఫోటోకి Not saying pink is the colour of the season, but who’s disagreeing? అంటూ పెట్టిన క్యాప్షన్ పిక్స్ గా మరింత క్రేజీగా మార్చేశాయి.
జువెలరీ లేకుండానే మినిమల్ లుక్‌లో
ఇక ఈ ఫోటోషూట్‌లో రియా చాలా సింపుల్‌గా కనిపిస్తూనే ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది,ముఖ్యంగా లైట్ పింక్ కలర్ రిబ్డ్ స్వెటర్, లైట్ బ్లూ డెనిమ్ జీన్స్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు క్యాజువల్ ఫ్యాషన్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోయాయి.పైగా ఇందులో ఎలాంటి జువెలరీ లేకుండానే మినిమల్ లుక్‌లో మరింత బ్యూటీఫుల్ గా కనిపించడం విశేషం.ఇక లూజ్ హెయిర్, సింపుల్ మేకప్ ఈ లుక్ ని మరింత ఎన్ హన్స్ చేయగా పింక్ కలర్ స్వెటర్‌కు బ్లూ డెనిమ్ జీన్స్ కాంబినేషన్ సరిగ్గా సెట్ అయిపొయింది.
సాధారణంగా ఫ్యాషన్ విషయంలో సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తుంటారన్న సంగతి తెల్సిందే.కానీ రియా మాత్రం ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ గానే ఎలా ఎలా స్టైలిష్ గా కనిపించవచ్చో ఈ ఫోటో షూట్ తో ప్రూవ్ చేసింది.ఇక రియా వేసిన స్వెటర్ లాంటి పింక్ టీ షర్ట్ ఈ వింటర్ సీజన్ లో క్యాజువల్ టీ షర్ట్ గా మారిపోయింది.
ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమా తోనే
ఇక సినిమాల విషయానికి వస్తే రియా చక్రవర్తి మొట్ట మొదటగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమా తోనే.అవును..2012 లో వచ్చిన తూనీగా తూనీగా సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో మేరే డాడ్ కీ మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ .
ముఖ్యంగా 2018లో విడుదలైన జలేబీ సినిమాలో ఆమె ఇచ్చిన ఫెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.ఇక అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చెహ్రే సినిమాలోనూ కనిపించి సందడి చేసింది కూడా.
ఎలాంటి సినిమాలతో పలకరించనుందో !
మొత్తానికి సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తనవైన క్రేజీ అప్ డేట్స్ తో అభిమానులని అలరిస్తూనే ఉంది.ఈ క్రమంలోనే ఇపుడు పింక్ స్వెటర్‌లో కనిపించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.చూడాలి మరి కాస్త కెరీర్ లో స్లో అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ముందు ముందు ఎలాంటి సినిమాలతో పలకరించనుందో !