E-Paper
Advertisement

రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా? ఎందుకంత స్పెషల్ అంటే?

రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా? ఎందుకంత స్పెషల్ అంటే?
Advertisement

Upasana Konidela: ఉపాసన కొణిదెల ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మెగా ఇంటి కోడలుగా రామ్ చరణ్(Ramcharan) భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. ఇక ఉపాసన (Upasana)అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఉపాసన వైజాగ్ లో ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తో కలిసి ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరి మధ్య ఎన్నో విషయాల గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ రాపిడ్ ఫెయిర్ సెషన్ లో భాగంగా ఉపాసనకు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు.

చరణ్ నాయక్ మూవీ చాలా ఇష్టం..

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏది అంటూ నారా లోకేష్ ప్రశ్నించడంతో ఉపాసన సమాధానం చెబుతూ.. నాయక్ సినిమా(Nayak Movie) అంటే చాలా ఇష్టమని ఉపాసన సమాధానం చెప్పడంతో ఒకసారిగా మెగా ఫాన్స్ షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఉపాసన RRR లేదా రంగస్థలం వంటి సినిమా పేర్లు చెబుతుందని అందరూ భావించారు కానీ ఈమె ఊహించని విధంగా రాంచరణ్ నటించిన నాయక్ సినిమా పేరు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా ఆదరణ పొందలేదు కానీ ఉపాసనకు ఈ సినిమా అంటే ఎందుకంత ఇష్టం అని ఆశ్చర్యపోతున్నారు.

చరణ్ భార్య హోదాలో చూసిన సినిమా..

Advertisement

ఇక ఉపాసనకు నాయక్ సినిమా ఎందుకు ఇష్టం, ఆ సినిమా ప్రత్యేకత ఏంటి అనే విషయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. నాయక్ సినిమాకు వివి వినాయక్ (V.V.Vinayak)గారు దర్శకత్వం వహించారని, తాను రామ్ చరణ్ భార్యగా అతనితో కలిసి చూసిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా తనకు ఎప్పుడు ప్రత్యేకమేనని, అందుకే ఈ సినిమా అంటే ఇష్టం అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత రామ్ చరణ్ భార్య హోదాలో థియేటర్లో ఈ సినిమా చూడటంతో ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు.

సుకుమార్ డైరెక్షన్లో చరణ్..

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన సుకుమార్ డైరెక్షన్లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ ప్రస్తుతం తన 17వ చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నారు. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలను కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: డైరెక్టర్ గా కంటే ఆర్టిస్ట్ గా ఉండడమే మంచిది..కడుపు నిండా తినలేని పరిస్థితి: జబర్దస్త్ బాబు

 

Related News

డబ్బు పవర్ అంటే ఇదేనేమో.. ఇట్లు అర్జున కోసం క్యూ కట్టేసిన టాలీవుడ్‌!

‘రియాలిటీ’ లో రఘుకుల తిలకా రారా సాంగ్..కిరణ్ అబ్బవరం క్లారిటీ!

కవ్వించే ఫోజులతో గిలిగింతలు పెడుతున్న మెగా డాటర్ నిహారిక!

‘స్వాభిమానం’ పద్ధతిలో అనిరుధ్ – కావ్య పెళ్లి? దీని ఆంతర్యం ఏంటంటే?

ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతులు కీలక ఒప్పందం.. రూ.36 కోట్లు పెట్టుబడి

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపే దాదా ధమాకా!

పవన్ కళ్యాణ్ విడాకులపై మాధవీ లత సంచలన కామెంట్స్.. అసలు విషయం ఇదేనా?

Big Stories

Advertisement
×