E-Paper
Advertisement

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపే దాదా ధమాకా!

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపే దాదా ధమాకా!
Advertisement

Balakrishna Dada:నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు.తాను నటిస్తున్న దాదా సినిమా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసేశాడు. అవును.. ఈ సినిమా నుండి మొదటి పాట రేపే వచ్చేస్తుందని మేకర్స్ అనౌన్స్ చేయడంతో మురిసిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.

‘ది కింగ్ ఆఫ్ ఖయాస్ ఈజ్ బ్రింగింగ్ ఏ మ్యూజికల్ స్టార్మ్’ అంటూ విడుదల చేసిన పోస్టర్‌తో మేకర్స్ ఇప్పటికే ఈ పాటపై అంచనాలను పెంచేశారు. ఇక రేపు సాయంత్రం 4:48 గంటలకు ‘దాదా’ సినిమా నుంచి తొలి పాటనురిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు కూడా . సాధారణంగా బాలకృష్ణ సినిమాల్లో పాటలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు.

Advertisement

ముఖ్యంగా ఆయన స్క్రీన్ మీద కనిపించే స్టైల్, డ్యాన్స్ మూమెంట్స్ కి జనాలు ఊగిపోతారు.ఒక రకంగా బాలయ్య పాటలంటే అభిమానులకి పండగే.అలాంటి బాలయ్య నుండి ఇపుడు మరో పాట వస్తుండటంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బాలయ్య ఫాన్స్.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్ అన్న సంగతి తెల్సిందే.గతంలో బాలకృష్ణ సినిమాలకు తమన్ ఎలాంటి సంగీతం అందించాడో చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాల్లో మ్యూజిక్ తో పాటు , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ కి మాంచి కిక్కిచ్చాయి.

Advertisement

ముఖ్యంగా బాలయ్య ఎంట్రీ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో తమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లలో అభిమానులకు నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇచ్చింది.ఈ క్రమంలోనే ‘దాదా ధమాకా’ పాటలో తమన్ ఎలాంటి బీట్స్‌తో సందడి చేయబోతున్నాడంటూ అంచనాలు పెంచేస్తున్నారు.

ఇక ఈ పాటలో బాలకృష్ణ కి జోడీగా బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ నటిస్తుందని తెలుస్తుంది. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని గతంలో బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ అంటూ సాలిడ్ మాస్ ఎంటర్‌టైనర్‌ తీసిన సంగతి తెల్సిందే.ఇకపోతే ఈ సినిమాని డిసెంబర్ 24న రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేసింది మూవీ టీమ్.

ALSO READ :పవన్ కళ్యాణ్ విడాకులపై మాధవీ లత సంచలన కామెంట్స్.. అసలు విషయం ఇదేనా?

క్రిస్మస్ పండుగకు ముందు థియేటర్లలోకి రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కి రేపు సాయంత్రం 4:48 గంటలకు సంథింగ్ స్పెషల్ అన్న మాట.చూడాలి మరి రేపు  రానున్న ఈ సాంగ్ ఎన్ని సంచలనాల్ని నమోదు చేస్తుందో.

Tags

Related News

పవన్ కళ్యాణ్ విడాకులపై మాధవీ లత సంచలన కామెంట్స్.. అసలు విషయం ఇదేనా?

ఆ సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వేస్ట్.. త్రివిక్రమ్‌పై నిర్మాత ఫైర్!

అందాల ఆరబోతలో తగ్గేదేలే.. రుహానీ శర్మ రచ్చ మామూలుగా లేదుగా!

రూ.1000 కోట్లకు ఒక్క అడుగే దూరం.. రామాయణం రచ్చ మామూలుగా లేదుగా!

KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !

మేడం టుస్సాడ్స్ లో విగ్రహం…వారానికే ఘోర ప్రమాదం..కాజల్ కామెంట్స్ వైరల్!

ఏఐతో సినిమాలు, పాటలు.. ఇక మనుషుల అవసరం లేదా?ఆర్జీవీ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×