E-Paper
Advertisement

ఆ సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వేస్ట్.. త్రివిక్రమ్‌పై నిర్మాత ఫైర్!

ఆ సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వేస్ట్.. త్రివిక్రమ్‌పై నిర్మాత ఫైర్!
Advertisement

Trivikram Nagavamsi:ఆదర్శకుటుంబం సినిమా అనుకుంతగా వసూలు చేయలేదని దీని కారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ మధ్య ఏదో వివాదం నడుస్తుందని ఫిలిమ్ సర్కిల్స్ లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా ఈవెంట్స్ లలో ఎక్కడా నాగ వంశీ కనిపించకపోవడం తో వీరిద్దరి ఏమైనా చెడిందా అన్న టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తుంది.ఇక ఇదే విషయంపై తాజాగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

త్రివిక్రమ్, నాగవంశీ మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయని, సినిమా ప్రమోషన్లకు కూడా నాగవంశీ రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నారన్న వార్తలపై తుమ్మలపల్లి మాట్లాడుతూ నాగవంశీని నిజంగానే అడ్డుకున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయితే సినిమా ప్రమోషన్స్ లలో మాత్రం నాగవంశీ కనిపించలేదని, గతంలో ఎప్పుడు చూసినా నాగవంశీ ప్రమోషన్స్ లో తెగ హడావిడి చేసేవాడని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా కోసం దాదాపు రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు నష్టం వచ్చిందనే టాక్ వినిపిస్తుందనే ప్రశ్నకి సమాధానంగా ఈ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తనకు తెలియవని అయితే సినిమా కోసం మాత్రం చాలా ఎక్కువ ఖర్చు చేశారని, ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ విషయంలో భారీగా ఖర్చు పెట్టినట్లు తనకు తెల్సిందని,అసలు ఆ సినిమాకి అంత ఖర్చు పెట్టడం ఏంటో అని చెప్పారు.

Advertisement

ఇదే సమయంలో త్రివిక్రమ్ సినిమాల కథలపై మాట్లాడుతూ కొన్ని సినిమాలు గతంలో వచ్చిన సినిమాలకి కాపీలా ఉన్నాయని కథలోని మెయిన్ పాయింట్ తీసుకుని వేరే బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అల్లుతున్నారని విమర్శించారు.

‘అజ్ఞాతవాసి’ సినిమా విషయంలో ఇలాగే వేరే సినిమాతో పోలిక వచ్చిందని అలాగే ‘అల వైకుంఠపురములో’ సినిమా విషయంలోనూ ఇలాగే వినిపించిందని తెలిపారు.మరోవైపు చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా గురించి మాట్లాడుతూ సంక్రాంతికి ‘విశ్వంభర’వచ్చే అవకాశాలు ఉన్నాయని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోవచ్చిందని అందువల్ల విడుదల కావడం పక్కా అని తాను అనుకుంటున్నానని తెలిపారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం పెద్ద హీరోలు, ప్రముఖ నిర్మాతలు చిన్న సినిమాలను ప్రోత్సహించడం మంచి విషయమని అన్నారు .ఇక నిహారిక కొణిదెల సినిమా పై మంచి బజ్ ఉందని, ఒక చిన్న సినిమాకు పెద్ద హీరోలు ప్రచారం చేస్తే దాని రేంజ్ పెరుగుతుందని, ప్రేక్షకుల దృష్టిలో ఆ సినిమా గురించి చర్చ మొదలవుతుందని వివరించారు.

ఈ క్రమంలో రామ్ చరణ్ ఒక చిన్న సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి రావడాన్ని కూడా ఉదాహరణగా ప్రస్తావించారు. పెద్ద హీరోలు తమ స్టార్‌డమ్‌ను ఉపయోగించి చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీకి మంచిదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అదే విధంగా ‘ఇట్లు అర్జున్’, ‘చంద్రయానం’, ‘దొంగ నా కొడుకు’ వంటి సినిమాల గురించి మాట్లాడుతూ ఈ సినిమాలకు ఇప్పటికే మంచి బజ్ ఉందని, కంటెంట్ కనుక కరెక్ట్ గా కనెక్ట్ అయితే సినిమాలు సాలిడ్ వసూల్లని రాబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.మొత్తానికి  ఆదర్శకుటుంబం  పై తుమ్మల పల్లి చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి !

ALSO READ :అందాల ఆరబోతలో తగ్గేదేలే.. రుహానీ శర్మ రచ్చ మామూలుగా లేదుగా!

Tags

Related News

అందాల ఆరబోతలో తగ్గేదేలే.. రుహానీ శర్మ రచ్చ మామూలుగా లేదుగా!

రూ.1000 కోట్లకు ఒక్క అడుగే దూరం.. రామాయణం రచ్చ మామూలుగా లేదుగా!

KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !

మేడం టుస్సాడ్స్ లో విగ్రహం…వారానికే ఘోర ప్రమాదం..కాజల్ కామెంట్స్ వైరల్!

ఏఐతో సినిమాలు, పాటలు.. ఇక మనుషుల అవసరం లేదా?ఆర్జీవీ కామెంట్స్ వైరల్!

ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!

ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్ !

Big Stories

Advertisement
×