E-Paper
Advertisement

రూ.1000 కోట్లకు ఒక్క అడుగే దూరం.. రామాయణం రచ్చ మామూలుగా లేదుగా!

రూ.1000 కోట్లకు ఒక్క అడుగే దూరం.. రామాయణం రచ్చ మామూలుగా లేదుగా!
Advertisement

Ramayana Box Office:రామాయణం.. సాయి పల్లవి, రణ్ బీర్ కపూర్ సీతా రాములుగా నితీష్ తివారి దర్శకత్వంలో భారీ అంచనాలాతో వచ్చిన ఈ సినిమా ఇపుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది. . నమిత్ మల్హోత్రా దాదాపు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఇపుడు ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరేందుకు రెడీ అయిపొయింది.

నవంబర్ 5వ తేదీన రిలీజైన రిలీజ్ అయిన వారం రోజుల్లో ఇప్పటి వరకు ఇండియాలో 500 కోట్లకి పైగా నెట్, 600 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా ఏకంగా 300కోట్లకి పైగా వసూల్లని రాబట్టినట్టు తెలుస్తుంది.ఈ లెక్కన మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా 930కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం.అంటే వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా మరో ఒకటి రెండు రోజుల్లో ఎంట్రీ ఇవ్వడం పక్కా అన్న మాట.

Advertisement

ఇక రామాయణ బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను రెండు భాగాలకు కలిపి 4000 కోట్ల రూపాయల వరకు అయిందని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నిర్మాత నమిత్ మల్హోత్రా.ఇక ఈ సినిమా మొదటి భాగాన్ని 1200 కోట్ల రూపాయలతో నిర్మించగా . ప్రమోషన్స్ కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టాక్ . దాంతో ఈ సినిమా పార్ట్ 1 బడ్జెట్ సుమారుగా 1500 కోట్ల రూపాయలు వరకు అయిందని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్న మాట.

ఇక సినిమా విషయానికి వస్తే.. పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ యష్, రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి తో పాటు కన్నడ రాకింగ్ స్టార్ యష్ ,రకుల్ ప్రీత్ సింగ్, సన్నీడియోల్ తదితరులు నటించిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహించగా శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాను ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్, అట్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌పై సినిమాను నమిత్ మల్హోత్రా, యష్, చార్లెస్ రోవన్క్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో నిర్మించారు.

Advertisement

మొత్తానికి ఆది పురుష్ అందుకోలేని రికార్డుని రామాయణ అందుకోబోతుందన్న మాట.ఇక దురంధర్ 2 తర్వాత ,మళ్ళీ వెయ్యి కోట్ల బొమ్మ లేదని బాధ పడిపోతున్న మూవీ లవర్స్ కి రామాయణం మాంచి గుడ్ న్యూస్ చెప్పబోతుంది.చూడాలి మరి వెయ్యి కోట్ల క్లబ్ లో కూర్చోబోతున్న ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

ALSO READ :KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !

Tags

Related News

KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !

మేడం టుస్సాడ్స్ లో విగ్రహం…వారానికే ఘోర ప్రమాదం..కాజల్ కామెంట్స్ వైరల్!

ఏఐతో సినిమాలు, పాటలు.. ఇక మనుషుల అవసరం లేదా?ఆర్జీవీ కామెంట్స్ వైరల్!

ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!

ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్ !

మీ ఇంటిని పేల్చేస్తాం… అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్!

కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మలైకా.. ఆ గ్లామర్ ఏంటి బాసూ!

Big Stories

Advertisement
×