RGV on AI: AI ..AI ..AI ..ఇపుడు ఎక్కడ చూసినా ఈ పదమే వినిపిస్తుంది.ముఖ్యంగా ఫొటోలు, వీడియోలు, పాటలు, సినిమాలు.. ఇలా అన్నింటినీ ఏఐతోనే తయారు చేసేస్తున్నారని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అయితే ఇలా AI విచ్చల విడిగా వ్యాపించడంతో అసలు ముందు దీని ప్రభావం ఎంత ఉంటుంది,ఇలాగే AI పెరిగిపొతే మనుషుల పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు ఉంటాయా? మనుషుల అవసరం తగ్గిపోతుందా? వంటి ప్రశ్నలపై ఒక ఇంటర్వ్యూలో RGV ఇలా చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఏఐ వచ్చాక మనిషి ఆలోచించే పనులను కూడా చేసేస్తోంది. దీంతో ఫ్యూచర్ లో మనుషులకు ఉద్యోగాలు ఉండకపోవచ్చని వర్మ తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టాడు.2030 నాటికి మనిషి చేసే చాలా పనులను ఏఐ, రోబోలు చేసేస్తే.. అప్పుడు మనుషులు ఏం చేయాలనే ప్రశ్న వస్తుందని అన్నారు.
మనుషులు కుక్కల్లా మారిపోతారా?
ఇక ఇంట్లో కుక్కను పెంచుకుంటే దానికి తిండి పెడతాం, చూసుకుంటాం. అది తింటుంది, ఆడుకుంటుంది, పడుకుంటుంది. భవిష్యత్తులో ఏఐ వల్ల మనుషుల పరిస్థితి కూడా ఇలాగే మారొచ్చని ఆయన అన్నారు.ఎందుకంటే ఉద్యోగాలు లేకపోతే సంపాదన ఉండదు. సంపాదన లేకపోతే డబ్బు అవసరం కూడా తగ్గిపోవచ్చు. అప్పుడు మనుషులు ఏం చేస్తారు? జీవితాన్ని ఎలా గడుపుతారు? అనేది పెద్ద ప్రశ్నగా మారుతుందని అసలు విషయం చెప్పుకొచ్చారు.
డాక్టర్లు, లాయర్లకు కూడా కష్టమేనా?
ఏఐ వల్ల మాములు ఉద్యోగాలే కాదు.. డాక్టర్లు, లాయర్ల లాంటి వాళ్ల పనులు కూడా మారిపోతాయని వర్మ అన్నారు. డాక్టర్లు ఎన్నో ఏళ్లు చదివి సంపాదించే అనుభవాన్ని ఏఐ క్షణాల్లో అనాలసిస్ చేస్తుందని చెప్పారు.మరీ ముఖ్యంగా హైదరాబాద్ కి చెందిన ఒక డాక్టర్ కూడా ఇపుడు తనకేదైనా సమస్య వస్తే AI తో చెక్ చేసుకుంటున్నాడని ఎగ్జాంపుల్ గా వివరించారు.
మనుషులతో కాకుండా ఏఐతోనే స్నేహమా?
రాబోయే రోజుల్లో మనుషులు నిజమైన స్నేహితుల కంటే ఏఐతోనే ఎక్కువగా మాట్లాడే పరిస్థితి రావచ్చని వర్మ అన్నారు. ఎందుకంటే మనుషులతో మాట్లాడితే గొడవలు, అభిప్రాయాలలో భేదాలు ఉంటాయి. కానీ ఏఐ మాత్రం మనకు నచ్చినట్టే సమాధానం చెబుతుంది. దీంతో మనుషుల మధ్య బంధాలు కూడా మారిపోవచ్చని తనదైన శైలిలో వివరించారు.
సంగీత దర్శకుల పరిస్థితి ఏంటి?
ఇక ఇపుడు AI తో ప్పుడు ఏఐతో పాటలు కూడా తయారు చేస్తున్నారని పాట జనాలకు నచ్చితే దాన్ని ఎవరు చేశారన్నది ముఖ్యం కాదని వర్మ అన్నారు.అంటే రేపు ఏఐతో తయారైన పాటలు హిట్ అయితే సంగీత దర్శకులు, సింగర్ల పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచించాల్సిందే నన్న మాట.
డీప్‌ఫేక్ వీడియోలపై
ఇక హీరోయిన్ల ఫోటోలు ,వీడియో లని మార్ఫింగ్ చేయడం పై RGV మాట్లాడుతూ AI ని మంచికి ఎలా ఉపయోగించవచ్చో అలాగే చెడుకి కూడా ఉపయోగించవచ్చని చెప్పుకొచ్చారు.మొత్తంగా 2030 కల్లా AI విచ్చల విడిగా వ్యాపిస్తే ఇక మనుషుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చని చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్ !
ALSO READ :ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!