E-Paper
Advertisement

మేడం టుస్సాడ్స్ లో విగ్రహం…వారానికే ఘోర ప్రమాదం..కాజల్ కామెంట్స్ వైరల్!

మేడం టుస్సాడ్స్ లో విగ్రహం…వారానికే ఘోర ప్రమాదం..కాజల్ కామెంట్స్ వైరల్!
Advertisement

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామాయణ (Ramayana)సినిమాలో ఈమె రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా మండోదరిగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) పాత్ర మొదటి భాగంలో తక్కువగా ఉన్నప్పటికీ రెండో భాగంలో చాలా కీలకంగా ఉండబోతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కాజల్ అగర్వాల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో భారతీయుడు 2(Bharateeyudu 2 ) సెట్ లో జరిగిన ప్రమాదం గురించి ఈమె గుర్తు చేసుకున్నారు.

సింగపూర్ మేడం టుస్సాడ్స్ లో విగ్రహం ఏర్పాటు..

కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 లో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో 100 అడుగులు భారీ క్రేన్ తన కళ్ళ ముందే కూలిపోయిందని తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందు సింగపూర్ మేడం టుస్సాడ్స్(Madam Tussads) లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇలా ఈ విగ్రహం ఏర్పాటు చేసిన వారం రోజులకే తాను భారతీయుడు 2 షూటింగ్లో పాల్గొన్నాను. అయితే అప్పుడు రాత్రిపూట సన్నివేశాలకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.

తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా..

Advertisement

ఈ షూటింగ్లో భాగంగా తాను 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రోస్థటిక్ మేకప్ లో ఉన్నాను. షూటింగ్లో భాగంగా మాకు సంబంధించిన సన్నివేశాలు లేకపోతే తాము మానిటర్ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాము అయితే ఆ రోజు తాను మానిటర్ దగ్గర లేకుండా అలా నడుస్తూ ముందుకు వెళుతుండగా 100 అడుగుల క్రేన్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ సమయంలో నన్ను అక్కడి నుంచి ఎవరో పక్కకు లాగేసారు. ఈ ఘటన క్షణాలలో జరిగిపోయిందని ఇప్పటికీ ఆ సంఘటనను తలుచుకుంటే నాకు వణుకు పుడుతుందని కాజల్ తెలిపారు.

కృష్ణుడు భక్తురాలిగా మారిపోయాను..

ఈ ప్రమాదంలో భాగంగా తనకు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డానని ఆ క్షణం నుంచి తాను కృష్ణుడి భక్తురాలిగా మారిపోయాను అంటూ అప్పటి విషయాన్ని ఈ సందర్భంగా కాజల్ గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో భాగంగా అప్పుడు ముగ్గురు మరణించారని ఈ ప్రమాదం నుంచి తాను బయటపడటం అనేది ఒక మిరాకిల్ అంటూ ఈమె తెలిపారు. ఇక కాజల్ ప్రస్తుతం హీరోయిన్గా కాకపోయినా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న దాదా సినిమాలో కూడా కాజల్ నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Advertisement

Also Read: చిరు  ‘మెగా వర్స్’ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

Related News

ఏఐతో సినిమాలు, పాటలు.. ఇక మనుషుల అవసరం లేదా?ఆర్జీవీ కామెంట్స్ వైరల్!

ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!

ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్ !

మీ ఇంటిని పేల్చేస్తాం… అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్!

కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మలైకా.. ఆ గ్లామర్ ఏంటి బాసూ!

అహంకారమా? బాధ?బాబు మోహన్ నీకు ఇది తగునా?

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

Big Stories

Advertisement
×