E-Paper
Advertisement

KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !

KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !
Advertisement

Tammareddy Bharadwaja:ఒకప్పుడు పెద్ద హీరోలు ఏడాది మూడు లేదా రెండు సినిమాలు తీసేవారు.అలాంటిది ఇపుడు కనీసం రెండేళ్ళకి గానీ ఒక సినిమా వదల్లేక పోతున్నారు.పైగా చేసే సినిమాల కోసం వందల కోట్లు కుమ్మరిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఇదే విషయంపై తనదైన శైలిలో మండి పడ్డారు.

ఏడాదికి ఆరు సినిమాలు చేసిన హీరోలు

Advertisement

ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు ఏడాదికి ఆరు, ఏడు సినిమాలు చేసేవారని తమ్మారెడ్డి గుర్తు చేశారు. కృష్ణ అయితే కొన్ని సంవత్సరాల్లో 13, 14 సినిమాలు కూడా చేశారని, అప్పట్లో సినిమా షూటింగ్‌లు త్వరగా పూర్తయ్యేవని, ఇండస్ట్రీలో అందరికీ పని ఉండేదని వివరించారు.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, చిన్న హీరోలైనా, పెద్ద హీరోలైనా ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టంగా మారిందని ఒక సినిమా పూర్తి కావడానికి రెండుమూడేళ్లు పడుతోందని మండిపడ్డారు . దీనికి కారణం ప్రతి ఒక్కరూ పెద్ద బడ్జెట్ సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉండటమేనని తన మనసులోని మాటల్ని బయట పెట్టారు.
ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

బాహుబలి, కేజీఎఫ్ వచ్చాక 

ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలు సాలిడ్ హిట్స్ అవడంతో చాలామంది హీరోలు, దర్శకులు కూడా అదే స్థాయిలో సినిమాలు చేయాలని చూస్తున్నారని సెటైర్ వేశారు.కానీ ప్రతి సినిమా వందల కోట్లతోనే తీయాల్సిన అవసరం లేదని దీనికి కాంతార సినిమాని ఎగ్జాంపుల్ గా వివరించారు.

తక్కువ బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిందని ,కాబట్టి కావాల్సింది బడ్జెట్ కాదు కంటెంట్ అంటూ ఫైర్ అయ్యారు.మంచి కథ ఉంటే తక్కువ ఖర్చుతో కూడా పెద్ద హిట్ కొట్టొచ్చని , ఒక సినిమా హిట్ అయిందని అందరూ అలాగే
సినిమాలు తీయాల్సిన అవసరం లేదని సూచించారు.

ఇండస్ట్రీలో కొంతమంది చేతుల్లోనే 

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ ఐదారు పెద్ద నిర్మాణ సంస్థల చేతుల్లోనే చాలామంది హీరోలు, దర్శకుల అవకాశాలు ఉంటున్నాయని తనదైన శైలిలో విశ్లేషించారు. చిన్న నిర్మాతలు ఒక కొత్త దర్శకుడితో సినిమా తీసి హిట్ కొట్టినా ఆ దర్శకుడు తర్వాతి సినిమా తమతోనే చేస్తాడనే గ్యారంటీ ఉండటం లేదని చెప్పారు. చిన్న సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకులకు బడా నిర్మాతలు ఖర్చీఫ్ వేసేస్తున్నారని
వివరించారు.

అప్పట్లో 40 రోజుల్లో సినిమా.. ఇప్పుడు 

ఒకప్పుడు అడవిరాముడు లాంటి పెద్ద సినిమాలను కూడా 30 నుంచి 40 రోజుల్లో పూర్తి చేసేవారని, షూటింగ్ పూర్తయిన తర్వాత డబ్బింగ్ కూడా వారం రోజుల్లో అయిపోయేదని చెప్పారు.కానీ ఇప్పుడు డబ్బింగ్‌కే నెలలు పడుతోందని ఒక్కో ఆర్టిస్ట్‌కు ఒక్కో టైమ్‌లో డేట్స్ కుదరడం, కాంబినేషన్లు, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతోందని వివరించారు.

ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా చేయాలంటే భారీ బడ్జెట్ తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని అన్నారు. ఒక కథకు ఎంత బడ్జెట్ అవసరమో ఆలోచించకుండా.. హీరో స్థాయిని బట్టి ఎంత ఖర్చు పెట్టాలనే లెక్కలు వేస్తున్నారని చెప్పారు.

హీరో, హీరోయిన్, దర్శకుడు, కెమెరామన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరి పారితోషికాలు కలిపేసరికి సినిమా మొదలవకముందే బడ్జెట్ భారీగా పెరిగిపోతోందని తమ్మారెడ్డి ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి !

ALSO READ :ఏఐతో సినిమాలు, పాటలు.. ఇక మనుషుల అవసరం లేదా?ఆర్జీవీ కామెంట్స్ వైరల్!

Tags

Related News

మేడం టుస్సాడ్స్ లో విగ్రహం…వారానికే ఘోర ప్రమాదం..కాజల్ కామెంట్స్ వైరల్!

ఏఐతో సినిమాలు, పాటలు.. ఇక మనుషుల అవసరం లేదా?ఆర్జీవీ కామెంట్స్ వైరల్!

ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!

ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్ !

మీ ఇంటిని పేల్చేస్తాం… అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్!

కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మలైకా.. ఆ గ్లామర్ ఏంటి బాసూ!

అహంకారమా? బాధ?బాబు మోహన్ నీకు ఇది తగునా?

Big Stories

Advertisement
×