E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ విడాకులపై మాధవీ లత సంచలన కామెంట్స్.. అసలు విషయం ఇదేనా?

పవన్ కళ్యాణ్ విడాకులపై మాధవీ లత సంచలన కామెంట్స్.. అసలు విషయం ఇదేనా?
Advertisement

Madhavi Latha:పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి విడాకులు ఇవ్వడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది. ముఖ్యంగా ఆయన యాంటి ఫ్యాన్స్ ఈ విషయంపై నెట్టింట్లో పవన్ ని చెడుగుడు ఆడేస్తున్నారు కూడా.అయితే ఈ సందర్భంగా ఇదే విషయంపై నటి మాధవీ లత పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు కొందరికి ఆయన సినిమాలు, రాజకీయాలు కంటే మూడు పెళ్లిళ్ల విషయమే ఎక్కువగా గుర్తొస్తుందని చెప్పుకొచ్చింది.ఇప్పుడు విడాకుల విషయం తెరపైకి వస్తే దాన్ని కూడా విమర్శలకు వాడుకుంటారని ,అయితే ఒకరి వ్యక్తిగత జీవితాన్ని పట్టుకుని విమర్శించడం ఎంత వరకు సరైనదంటూ మండిపడింది.

Advertisement

అలాగే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, అలాంటప్పుడు భార్యకు విడాకులు ఇవ్వడం ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని కానీ ధర్మం గురించి మాట్లాడటం వేరు, భార్యాభర్తల మధ్య వ్యక్తిగత సమస్యలు వేరని చెప్పారు. ఈ రెండింటినీ కలిపి చూడకూడదని తెలిపింది.

ఇక పవన్ కళ్యాణ్ విడాకుల అంశంపై తన అభిప్రాయాన్ని చెబుతూ భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండటం ఎంత ముఖ్యమో, ఒకరికొకరు సమయం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్పింది.ముఖ్యంగా మహిళలకు భర్త నుంచి డబ్బు, సౌకర్యాలు మాత్రమే సరిపోవని, తమతో కాసేపు మాట్లాడాలని, తమ సంతోషాన్ని పంచుకోవాలని, కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటారని వివరించింది.

Advertisement

ఇక్కడే అసలు సమస్య మొదలవుతుందని భర్త ఎంత బిజీగా ఉన్నా భార్యకు కొంత సమయం కేటాయించాలి. ఫోన్ చేసినప్పుడు మాట్లాడటం, పిల్లల గురించి తెలుసుకోవడం, ఆమె చెప్పే చిన్న చిన్న విషయాలు వినడం కూడా చాలా ముఖ్యమని చెప్పింది. ఇవి జరగకపోతే భార్యాభర్తల మధ్య మెల్లగా దూరం పెరుగుతుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారని, సినిమాలతో పాటు ప్రభుత్వ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి వస్తోందని ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమై ఉండొచ్చని తనదైన శైలిలో విశ్లేషించింది.తనకు తెలిసిన చాలా కుటుంబాల్లో కూడా భర్తలు మంచివాళ్లే అయినా, పని ఒత్తిడి వల్ల భార్యలకు సమయం ఇవ్వలేకపోతున్నారని చెప్పుకొచ్చింది.

భార్యలు కూడా మొదట్లో భర్త బిజీగా ఉన్నారని సర్దుకుపోతారని, కొంతకాలం తర్వాత పిల్లలే ప్రపంచంగా బతకడం మొదలుపెడతారని తెలిపింది .నీ అందరూ అలా సర్దుకుపోవాలని చెప్పలేమని, ప్రతి ఒక్కరికీ తన జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని చెప్పింది.

అయితే పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా మధ్య అసలు ఏం జరిగిందో తనకు తెలియదని వాళ్ల మధ్య గొడవలు జరిగాయని, మరేదైనా కారణం ఉందని తాను చెప్పడం లేదని వివరించింది.తన అంచనా ప్రకారం భర్త సమయం ఇవ్వలేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని తెలిపింది.

మరోవైపు విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇద్దరూ సంతోషంగా ఉండొచ్చని, పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు కొనసాగించవచ్చని చెప్పుకొచ్చింది. కలిసి ఉండి ప్రతిరోజూ బాధపడటం కంటే, విడిగా ఉంటూ ప్రశాంతంగా ఉండటం కొన్నిసార్లు మంచిదని తన మనసులోని మాటని బయట పెట్టింది.

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో కలపవద్దని ఆయన రాజకీయ నాయకుడిగా ఏం చేస్తున్నారు? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? లేదా? అనే విషయాలపై ప్రశ్నించాలంటూ మాధవీ లత చేసిన కామెంట్స్ ఇపుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

ALSO READ :ఆ సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వేస్ట్.. త్రివిక్రమ్‌పై నిర్మాత ఫైర్!

Tags

Related News

ఆ సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వేస్ట్.. త్రివిక్రమ్‌పై నిర్మాత ఫైర్!

అందాల ఆరబోతలో తగ్గేదేలే.. రుహానీ శర్మ రచ్చ మామూలుగా లేదుగా!

రూ.1000 కోట్లకు ఒక్క అడుగే దూరం.. రామాయణం రచ్చ మామూలుగా లేదుగా!

KGFను చూసి నేర్చుకోవాల్సింది ఇదేనా?తమ్మారెడ్డి ఫైర్ !

మేడం టుస్సాడ్స్ లో విగ్రహం…వారానికే ఘోర ప్రమాదం..కాజల్ కామెంట్స్ వైరల్!

ఏఐతో సినిమాలు, పాటలు.. ఇక మనుషుల అవసరం లేదా?ఆర్జీవీ కామెంట్స్ వైరల్!

ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!

Big Stories

Advertisement
×