Kavya Maran – Stalin: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం గ్రాండ్ గా జరిగింది. గ్రీసులోని సముద్ర తీరాన ఓ లగ్జరీ ప్యాలెస్ లో కావ్య మారన్ మెడలో మూడు ముళ్లు వేశాడు అనిరుధ్. నవంబర్ 11న ఈ బ్యూటీఫుల్ జంట వివాహం జరుగగా, ఎంగేజ్మెంట్ నవంబర్ 10న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇక పెళ్లి జరిగిన తర్వాత కావ్య మారన్, అటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తమ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుని, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ కు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఉదయ్ నిధి స్టాలిన్, రజినీకాంత్ తదితరులు హాజరయ్యారు.
గ్రీస్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి జరుగగా, కొంత జంటతో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ దంపతులు ఫోటో దిగారు. ఈ సందర్భంగా కావ్య మారన్ పక్కన నిలబడ్డ స్టాలిన్ ఆమె చేతిని పట్టుకున్నాడు. అటు కావ్య పాప కూడా స్టాలిన్ చేతిలో పట్టుకునే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే, ఈ ఫోటోను వైరల్ చేస్తూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. కావ్య చేతిని పట్టుకున్నాడంటూ స్టాలిన్ ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బుతూలు తిడుతూ రెచ్చిపోతున్నారు.
కావ్య మారన్, ఎంకే స్టాలిన్ కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులే. కళనాధి మారన్, స్టాలిన్ వరుసకు తండ్రి, కొడుకులు అవుతారు. ఈ లెక్కన కావ్య మారన్ కు మాజీ సీఎం స్టాలిన్ తాతయ్య అవుతాడు. కావ్య మారన్ తాత మురసోలి మారన్, మాజీ సీఎం కరుణానిధి అక్క కుమారుడే. అంటే కరుణానిధికి మురసోలి మారన్ మేనల్లుడు అవుతాడన్నమాట. అంటే స్టాలిన్, మరసోలి మారన్ ఇద్దరూ కజిన్ బ్రదర్స్ అవుతారు. ఇలా స్టాలిన్….కావ్య మారన్ కు తాత వరుస అవుతాడు. అందుకే కావ్య పెళ్లిలో సందడి చేశాడు. పెళ్లి పనులు దగ్గరుండి చూసుకున్నాడు. వైరల్ అవుతున్న ఫోటోపై అనవసరంగా ట్రోల్స్ చేయొద్దని కూడా కావ్య ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రిసెప్షన్ మాత్రం చెన్నైలో చాలా గ్రాండ్ జరుగనుంది. నవంబర్ 21వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది.