E-Paper
Advertisement

NBK 111 Movie : సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత… ఆగిపోయిన బాలయ్య హిస్టారికల్ మూవీ

NBK 111 Movie : సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత… ఆగిపోయిన బాలయ్య హిస్టారికల్ మూవీ
Advertisement

NBK 111 Movie : వీర సింహా రెడ్డి.. 2023 సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బాలయ్యకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన గోపిచంద్ మలినేని… రెండో సారి బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. NBK 111 అనే వర్కింగ్ టైటిల్‌తో 2025 నవంబర్‌లో పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

అదో హిస్టారికల్ మూవీ అని… దాంట్లో మహారాజు పాత్రలో బాలకృష్ణ, రాణి పాత్రలో నయనతార కనిపిస్తారనే క్లారిటీ వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న టైంలో ఇప్పుడు ఈ NBK 111 మూవీ రద్దు అయిందనే వార్త తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

NBK 111 రద్దు…

Advertisement

వీరసింహా రెడ్డి మూవీతో సూపర్ హిట్ ఇవ్వడంతో… గోపిచంద్ మలినేనికి బాలయ్య మరో అవకాశం ఇచ్చాడు. ఈ సారి హిస్టారికల్ నేపథ్యంలో సాగే స్టోరీ చెప్పాడు. బాలయ్యకు నచ్చింది. ఈ సినిమాను నిర్మించడానికి వృద్ధి సినిమాస్ బ్యానర్‌తో సతీష్ కిలారు ముందుకు వచ్చాడు. పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి.

ఆగిపోవడానికి కారణాలు…

అయితే ఇప్పుడు సడన్‌గా ఈ సినిమాపై అందరూ వెనక్కితగ్గినట్టు తెలుస్తుంది. హిస్టారికల్ మూవీ కాబట్టి… సినిమా మేకింగ్‌కు చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే బడ్జెట్ కూడా ఈ మూవీ కథపరంగా చూస్తే కాస్త ఎక్కువగానే అయ్యే అవకాశాలు ఉన్నాయంట. దీంతో ఈ టైంలో ఈ స్టోరీతో సినిమా చేయడ కష్టమే అని… ఆ హిస్టారికల్ స్టోరీని పక్కన పెట్టేయాలని ఫిక్స్ అయ్యారట.

బాలయ్యకు కొత్త కథ..

Advertisement

హిస్టారికల్ కథను పక్కన పెట్టడంతో… బాలయ్యకు గోపిచంద్ మలినేని మరో స్టోరీ లైన్ చెప్పారంట. అది బాలయ్యకు బానే నచ్చిందంట కూడా. ఇప్పుడు గోపిచంద్ మలినేని ఫుల్ స్క్రీప్ట్ రాసే పనిలో ఉన్నారట. ఫుల్ స్క్రిప్ట్ రాసిన వెంటనే… బాలయ్య – గోపిచంద్ మలినేని కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం. దానికి కూడా వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సితీష్ కిలారే నిర్మాతగా ఉంటారట. దీని తర్వాత… బాలయ్యతో మూడో సినిమా చేయడానికి కూడా తన దగ్గర మరో కథను సిద్ధం చేసుకున్నాడట గోపిచంద్. అయితే.. అది ఇప్పుడే ఉండకపోవచ్చు.

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×