E-Paper
Advertisement

Akhanda 2 : ప్రొడ్యూసర్స్ కోసం పవన్ కళ్యాణ్ లా బాలకృష్ణ ఎందుకు రంగంలో దిగలేదు?

Akhanda 2 : ప్రొడ్యూసర్స్ కోసం పవన్ కళ్యాణ్ లా బాలకృష్ణ ఎందుకు రంగంలో దిగలేదు?
Advertisement

Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రీమియర్స్ పడాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయిపోయాయి. అయితే ప్రీమియర్ షోలో క్యాన్సిల్ అవ్వడానికి కారణం టెక్నికల్ ఇష్యూ అని బయట ఎక్కువగా వినిపించింది. కానీ ఈ షోల్ క్యాన్సిల్ అవ్వడానికి అసలైన కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్. యారోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు 14 రీల్స్ సంస్థకు మధ్య లావాదేవీల వలన సోలు క్యాన్సిల్ అయిపోయాయి.

ఇకపోతే డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రేపు కూడా విడుదలవుతుంది అనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఈ ఆర్థిక లావాదేవీల పరిస్థితి ఇప్పటివరకు తేలలేదు. చాలామంది బాలకృష్ణ అభిమానులు ఈరోజు షో చూడాలి అని ఎన్నో రోజుల నుంచి ఆత్రుతగా ఎదురు చూశారు. అలానే మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి చాలా క్యూరియాసిటీతో ఉన్నారు.

బాలకృష్ణ ఎందుకు రంగంలో దిగలేదు 

Advertisement

అయితే ఒక నిర్మాతలకు సమస్య వచ్చినప్పుడు కొంతమంది హీరోలు ఆదరణగా నిలబడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ ఆగిపోతుంది అనుకునే టైంలో ఏకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి తన తదుపరి సినిమాల గురించి హామీ ఇవ్వడంతోనే హరిహర వీరమల్లు సినిమా అనుకున్న టైం కి విడుదలైంది. లేకపోతే ఆ సినిమా భారీ నష్టాలను చవిచూసేది.

అలానే ఆ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్ చేశారు. రకరకాల షర్టులు మారుస్తూ వేర్వేరు ఛానల్ లో కనిపించారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలో అఖండ సినిమా ప్రీమియర్ షోలు ఆగిపోతుంటే నందమూరి బాలకృష్ణ ఎందుకు నిలబడట్లేదు అనే ఆలోచన చాలా మందికి ఉంది.

Advertisement

కానీ అసలు విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఇష్యూను సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఆర్థిక లావాదేవీలు ఈ రేంజ్ లో ఉన్నాయి అని తెలిసిన తర్వాత బాలకృష్ణ సైలెంట్ అయిపోయారు అని విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.

సినిమా మీద అంచనాలు 

సినిమా ఈరోజు రిలీజ్ అవ్వలేదు కానీ మామూలుగా అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ స్థాయిలో అంచనాలు ఏర్పడడానికి కారణం బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డు.

వీటన్నింటినీ మించి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో ప్రేక్షకులకు చెప్పనున్నారు బోయపాటి శ్రీను బాలకృష్ణ. ఇదివరకే రిలీజ్ చేసిన కంటెంట్ లో కూడా ఇదే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా లావాదేవీల విషయంలో క్లారిటీ వచ్చి సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది అని ఎంతగానో బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also Read: Akhanda 2 : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా లాగా, బాలకృష్ణ అభిమానులు డబ్బులు ఇస్తే బాగుంటుంది

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×