OTT Movie : ఈ వీకెండ్ అదిరిపోయే సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఓటిటిలోకి వచ్చిన ఈ కొత్త సినిమాలు మీకు బెస్ట్ ఛాయిస్. హిందీలో ‘క్రైమ్ థ్రిల్లర్ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్’, మరాఠీలో సోషల్ డ్రామా ‘స్థల్’, తెలుగులో ఫాంటసీ యాక్షన్ ‘మిరాయ్’, తమిళంలో మ్యాజికల్ డ్రామా ‘బాంబ్’, మలయాళంలో రొమాంటిక్ కామెడీ ‘మేన్ ప్యార్ కియా’ అనే ఈ కొత్త సినిమాలు మీ వీకెండ్ కి, మరచిపోని మెమొరీస్ ఇస్తాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? వీటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ హిందీ వెబ్ సిరీస్ కి రోహన్ సిప్పీ దర్శకత్వం వహించారు. ఇందులో కాన్కోనా సెన్ షర్మ, చంద్సీ కటారియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ నైనా అనే కాలేజ్ అమ్మాయి మిస్సింగ్ తో మొదలవుతుంది. ఆ తరువాత ఆమె ఒక పాలిటీషియన్ కార్‌లో శవమై కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ సన్యుక్తా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ విచారణలో షాకింగ్ సీక్రెట్స్ బయటపడతాయి. కిల్లర్ ఎవరెనేదాని చుట్టూ ఈ కథ ఉత్కంఠ భరితంగా నడుస్తుంది. ఈ థ్రిల్లర్ సిరీస్ 2025 అక్టోబర్ 10 నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మరాఠీ సోషల్ డ్రామా సినిమాకి జయంత్ సోమల్కర్ దర్శకత్వం వహించారు. ఇందులో నందినీ చిక్టే, తారాచంద్ ఖిరాట్కర్, సంగీతా సోనేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. ఈ కథ సవితా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. మహారాష్ట్ర లో ఒక గ్రామంలో ఉండే ఈ అమ్మాయి, బాగా చదువుకోవాలనుకుంటుంది. కానీ తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఆమె పై ఒత్తిడి తెస్తారు. అయితే ఆమె దీనికి పూర్తి వ్యతిరేకంగా, అమ్మాయిల హక్కుల గురించి పోరాడుతుంది. సోషల్ డ్రామా ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బెస్ట్ సజెషన్ . ఈ మూవీ 2025 అక్టోబర్ 10 నుంచి Zee 5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
కార్తిక్ గట్టమ్నేని దర్శకత్వం వహించిన ఈ తెలుగు ఫాంటసీ సినిమాలో తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, జగపతి బాబు, జయరామ్, శ్రీయ సరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథలో ఒక ఫాంటసీ ప్రపంచంలో శక్తులు, ఉండే 9 పవిత్ర గ్రంథాలను హీరో దుష్టుల చేతిలో పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనిషిని అమరుల్ని కూడా చేయగలవు. విలన్, హీరోల మధ్య ఈ గ్రంథాల కోసం ఫైట్ జరుగుతుంది. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రశంసలు అందుకుంది. ఇది Jio Hotstar లో 2025 అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
విశాల్ వెంకట్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమాలో ఆర్జున్ దాస్, కాళి వెంకట్, శివత్మిక రాజశేఖర్, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కాలకమ్మపట్టి గ్రామంలో రెండు వర్గాల మధ్య జరుగుతుంది. కతిరవన్ ఒక నాస్తికుడు చనిపోవడంతో అసలీ కథ మొదలవుతుంది. అతని బాడీలో నుంచి వచ్చే సౌండ్స్ వల్ల, అతన్ని గ్రామస్తులు దేవునిగా కొలుస్తారు. కతిరవన్ ఫ్రెండ్ మని కతిరవన్ డెత్ వెనుక నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ సినిమా 2025 అక్టోబర్ 10 నుంచి Amazon Prime, Aha లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫైజల్ ఫజిలుదీన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మలయాళం రొమాంటిక్ కామెడీ సినిమాలో, హృదు హారూన్, ప్రీతి ముఖుందన్, జగదీష్, మైమ్ గోపీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్యన్ (హృదు), నిధి (ప్రీతి) అనే లవర్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిధి మదురైలో మిస్సింగ్ అవ్వడంతో ఈ కథ మలుపు తీసుకుంటుంది. గౌతం అనే వ్యక్తి నిధిని కిడ్నాప్ చేసాడని తెలుసుకున్న ఆర్యన్, ఆమె కోసం ప్రాణాలకు తెగించి పోరాడతాడు. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవాళ్లు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా అక్టోబర్ 3 నుంచి Lionsgate Play
లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : పాడు పనులు చేసే తేడాగాళ్లే ఈ అమ్మాయి టార్గెట్… ఆమెను అనుభవించాలనుకుంటే పార్ట్స్ ప్యాకయ్యే షాక్