OTT Movie : మహిళల కోసం సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు చాలానే వస్తున్నాయి. ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంటుంది. రీసెంట్ గా ‘స్థల్’ అనే మరాఠీ మూవీ అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. అంతర్జాతీయంగా అవార్డ్ లను కూడా గెలుచుకుంది. ఇది టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో NETPAC అవార్డ్, 2024 పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ మరాఠీ ఫిల్మ్, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆడియెన్స్ అవార్డ్ గెలిచింది. ఈ కథ బాల్య వివాహాల చుట్టూ తిరుగుతుంది. పేద అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో ఈ మూవీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘స్థల్’ (Sthal) 2025లో వచ్చిన మరాఠీ సినిమా. జయంత్ దిగంబర్ సోమల్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో, నందిని చిక్టే, తారానాథ్ ఖిరట్కర్, సంగీతా సోనేకర్, సుయోగ్ ధావస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మార్చి 7 ఉమెన్స్ డే రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 10 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 7.1/10 రేటింగ్ పొందింది.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో దౌలత్రావ్, లీలాబాయ్ అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. 16 ఏళ్ల సవితా అనే కూతురు, మంగేష్ అనే కొడుకు ఉంటారు. అయితే ఇక్కడ చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లి చేసేస్తుంటారు. పెళ్ళికి ముందు అబ్బాయిలు, నచ్చిన అమ్మాయిని ఎంచుకుంటారు. ఈ క్రమంలో సవితా తల్లిదండ్రులు కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. కానీ సవితాకి అందం, డబ్బు లేకపోవడం పోవడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ విషయంలో సవితా డిప్రెషన్ కి వెళ్తుంది.
Read Also : భర్త బాస్ తో, భార్య ప్రియుడితో… అందరూ ఒకే గదిలో… అన్ని సీన్లు అరాచకమే మావా