Bandi Saroj Kumar : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడితే ఎవరికైనా లైఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సూర్యస్తమయం అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు బండి సరోజ్. ఎప్పుడో విడుదల కావలసిన ఆ సినిమా కొన్ని కారణాల వలన అనుకున్న డేట్ కి విడుదల కాలేదు. చెప్పిన డేట్ కు సినిమా రాలేదు కాబట్టి యూట్యూబ్ లో తను కొన్ని సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దగ్గర మంచి గుర్తింపు సాధించుకున్నాడు బండి సరోజ్.
బండి సరోజ్ చేసిన నిర్బంధం , మాంగల్యం సినిమాలకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత పరాక్రమం అని సినిమా కూడా చేశాడు కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటిస్తున్న సినిమా మొగ్లి. మొగ్లి సినిమాలో బండి సరోజ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. విడుదలైన ట్రైలర్ లో కూడా సరోజ్ కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
బండి సరోజ్ కుమార్ హీరో అవ్వాలి అని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే తనను ఎవరు హీరో చేయరు కాబట్టి తనకు తానుగానే హీరో అవ్వాలి అనే ఉద్దేశంతో ముందు డైరెక్షన్ నేర్చుకున్నారు. తనలో మంచి క్రియేటివిటీ ఉండడంతో తనకు తానుగా కథలు సిద్ధం చేసుకుని ఒకవైపు నటిస్తూ మరోవైపు డైరెక్షన్ చేసుకున్నారు. ఆ రకంగానే చాలామంది దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు.
అయితే ఈ తరుణంలో చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా బండి సరోజ్ రిజెక్ట్ చేశారట. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సరోజ్ ను ఎంపిక చేశారట బుచ్చిబాబు. పరాక్రమం షూటింగ్ కు వెళ్లి ఒక పాత్ర చేయాలని అడిగారట.
అయితే బండి సరోజ్ మాట్లాడుతూ నేను ఎప్పటికీ పాత్రలు చేయకూడదు అని అనుకుంటున్నాను. కానీ నన్ను ఈ పాత్ర కోసం అడిగినందుకు థాంక్యూ అని సున్నితంగా రిజెక్ట్ చేశారట. అయితే ఆ సినిమాను రిజెక్ట్ చేసినా కూడా తన పరాక్రమం ఈవెంట్ కు బుచ్చిబాబు ఏమి మనసులో పెట్టుకోకుండా హాజరైనట్లు కూడా మాట్లాడాడు.
నేను ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి అనేది సినిమా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది. సందీప్ రాజ్ డెడికేషన్ నాకు బాగా నచ్చింది ఐదు సంవత్సరాల నుంచి ఈ సినిమా గురించి నాతో చెబుతున్నాడు. నేను చెయ్యను అని చెప్పినా కూడా ఒకసారి కథ వినండి తర్వాత నిర్ణయం తీసుకోండి అని మాట్లాడాడు.
అయితే చెప్పిన కథను చెప్పినట్లుగా తీస్తేనే నేను చేస్తాను అని అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారట. మొత్తానికి చెప్పిన కథను చెప్పిన మాదిరిగానే సందీప్ తీశాడు అంటూ ఇంటర్వ్యూలో చెప్పాడు సరోజ్. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: JanaNayagan : భగవంత్ కేసరి రీమేక్ అని కన్ఫర్మ్ అయినట్లే, ఆ పాత్రలో గౌతమ్ వాసుదేవ్