Hungry cheetah Song: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ(OG). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు కూడా సిద్ధమవుతోంది అక్టోబర్ 23వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్(NetFlix) లో ప్రసారం కాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలబడడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం పవన్ కళ్యాణ్ అభిమానులకు మరొక సర్ప్రైజ్ ఇచ్చారు.
ఓజి సినిమాలో నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా అంటూ సాగిపోయే పాట థియేటర్లలో అభిమానులకు ఎంత ఊపు ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ఈ పాటను దాదాపు 8 సార్లు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కోసం ఉపయోగించారు. ఇలా ఈ అద్భుతమైన పాట ఎప్పుడెప్పుడు ఫుల్ వీడియో సాంగ్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. తాజాగా చిత్ర బృందం ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయడంతో హంగ్రీ చీటా సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుందని చెప్పాలి. ఈ ఫుల్ వీడియో సాంగ్ లో పవన్ కళ్యాణ్ అలా నడుచుకుంటూ రావడం, ఆయన స్వాగ్ కు అనుగుణంగా బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట వస్తుంటే చూడటానికి మరో లెవల్లో ఉందని చెప్పాలి.
ఇక ఈ పాటకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ లుక్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తమన్ బిజీఎం ఈ సినిమాకు మరింత హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి. మొత్తానికి ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక హంగ్రీ చీటా అంటూ సాగిపోయే ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు రఘురాం ధ్రువన్ లిరిక్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈయన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా అద్భుతమైన గేయ రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు అంతేకాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు పొందారు.
ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుంచి ఈ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మరి వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఓజి యూనివర్స్ నుంచి ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ సినిమాలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ నాని సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకు సంబంధించి సీక్వెల్ పనులు ప్రారంభం కానున్నాయి.
Also Read: Big tv Kissik Talks: బిగ్ బాస్ హౌస్ పాములు.. పులుల అరుపులు షాకింగ్ విషయాలు బయటపెట్టిన హరితేజ!