Kishkindapuri : కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కిష్కిందపురి. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.
మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఒక రోజు క్రితం ఈ సినిమా సెప్టెంబర్ 13న వస్తున్నట్లు మరొక పోస్టర్ అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో సినిమా 12న విడుదలబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల అవుతుంది అని అనౌన్స్ చేసినప్పుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరోజు వెనక్కి తగ్గాడు అని అందరూ ఊహించారు. అయితే సినిమా 13వ తారీకు రిలీజ్ చేద్దామా అని డిస్కషన్ జరుగుతుండగానే, సినిమాకు సంబంధించిన డిజిటల్ టీం సెప్టెంబర్ 13 విడుదల అని కిష్కిందపురి పోస్టర్ రెడీ చేసింది. అయితే సెప్టెంబర్ 12న ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇదే డేట్ కి కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) దర్శకత్వంలో తేజ నటిస్తున్న మిరాయి(Mirai) సినిమా విడుదల కానుంది. ఇదే ప్రశ్న నిర్మాతకు ఎదురైంది. అదే డేట్ కు ఇప్పుడు వస్తున్నారు కదా సినిమా ఎఫెక్ట్ అవ్వదా అంటూ ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగారు. దీనికి సమాధానంగా నిర్మాత మాట్లాడుతూ నా సినిమా రిలీజ్ డేట్ నేను ముందు అనౌన్స్ చేసి పోస్టర్ వేశాను. ఆ డేట్ కి వేరే సినిమా వస్తే ఏ సినిమా ఎఫెక్ట్ అవుతుందో ఆ రోజే తెలుస్తుంది అంటూ నిర్మాత మాట్లాడాడు.
ఇక మిరాయి ఈ సినిమా విషయానికొస్తే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పాలి. ట్రైలర్లో విజువల్స్ ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి. బిఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడ తేడా చూపించడానికి కూడా లేదు. పాన్ ఇండియా స్థాయిలో మరోసారి తేజ సక్సెస్ ఖాయం అయిపోయినట్లే అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మంచి బిజినెస్ జరిగింది. ఇక సినిమాకి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా అద్భుతమైన కలెక్షన్లు రావడం కూడా ఖాయం.
Also Read: Telugu audience : అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావాలి?