E-Paper
Advertisement

నిర్మాతలకు భారీ షాక్ ఇస్తున్న భాగ్యశ్రీ.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?

నిర్మాతలకు భారీ షాక్ ఇస్తున్న భాగ్యశ్రీ.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?
Advertisement

BhagyaShri Borse:మిగతా రంగాలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడు తలుపు తడతాయో.. ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తాయో చెప్పడం కష్టం. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నం చేసే సెలబ్రిటీ లందరూ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంటారు. అందులో కొంతమంది కాస్త విజయం లభించింది అంటే చాలు ఊహించని స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేసి నిర్మాతలకు భారంగా మారుతూ ఉంటారు.

ఒక్క హిట్.. రెమ్యూనరేషన్ డబుల్ చేసిన బ్యూటీ..

అయితే అందులో కొంతమంది సెలబ్రిటీలకు వారి డిమాండ్ ను బట్టి అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి కనబరిస్తుంటే.. మరికొంతమందికి ఆ రెమ్యూనరేషన్ ఇవ్వలేక అవకాశాలు ఇవ్వడం కూడా మానేస్తూ ఉంటారు . ఒకవేళ నిర్మాతలు కనుక అదే నిర్ణయం తీసుకుంటే ఇక భవిష్యత్తులో మళ్ళీ వారికి అవకాశం లభిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక టాలీవుడ్ యంగ్ బ్యూటీ కూడా ఒక హిట్ తన ఖాతాలో పడేసరికి అమాంతం రెమ్యూనరేషన్ పెంచేసి నిర్మాతలకు షాక్ ఇచ్చింది. మరి ఆమె ఎవరో? అసలు విషయం ఏమిటో? ఇప్పుడు చూద్దాం..

ఇన్నేళ్లలో లభించని గుర్తింపు..

Advertisement

ఆమె ఎవరో కాదు ప్రముఖ గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ. హిందీ చిత్రం ‘యారియాన్ 2’ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన భాగ్య శ్రీ. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక మాస్ మహారాజా హీరోగా , హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకొని అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత ‘కింగ్డమ్’ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించింది. కానీ ఇందులో కూడా ఈమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఆ తర్వాత తమిళంలో వచ్చిన కాంత సినిమాలో మెరిసిన ఈమె 2025లో రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పచ్చి గొల్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది.

నిర్మాతలకు భారం కానుందా?

ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలలో నటిస్తోంది కానీ సరైన గుర్తింపు రాలేదు.కానీ ఈ ఏడాది మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో భారతి పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈమె కెరియర్ కూడా మలుపు తీసుకుంది. ఈ విజయంతో తన రెమ్యూనరేషన్ ఏకంగా డబుల్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక్కో సినిమాకి కోటిన్నర తీసుకున్న భాగ్యశ్రీ.. ఇప్పుడు లెనిన్ ఇచ్చిన హిట్ తో ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో హీరోయిన్గా అవకాశం అందుకుంది.

Advertisement

also read:ఆస్కార్ అందుకున్న తొలి మహిళ.. ‘మై లెఫ్ట్ ఫుట్’ నటి మృతి!

నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

ఇకపోతే రెమ్యూనరేషన్ డబుల్ చేసింది అనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా ఈమెపై కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడే హిట్ లభించింది అప్పుడే రెమ్యూనరేషన్ పెంచడం ఏంటి ? కాస్త స్టార్డం వచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ పెంచింటే బాగుండేది. ఒకవేళ రెమ్యూనరేషన్ పెంచడం వల్ల కథలు కూడా దగ్గరకు రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించరా? అంటూ ఆమెపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం . ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచేసి నిర్మాతలకు భారంగా మారితే భవిష్యత్తులో అవకాశాలు లేకపోతే నష్టం ఎదుర్కోవాల్సిందే అని కూడా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ లెనిన్ హిట్ కారణంగానే భాగ్యశ్రీ రెమ్యూనరేషన్ పెంచేసింది అనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×