E-Paper
Advertisement

విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?

విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?
Advertisement

NTR Politics: ఇదివరకు సినీ రంగంనుండి ఎందఱో తారలు పాలిటిక్స్ లో తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న వారే.NTR.MGR నుండి చిరు, కమల్ వరకు .కొంతమంది సక్సెస్ కాగా మరికొంతమంది తట్టబుట్టా సర్దుకొని యూ టర్న్ తీసుకున్నవాళ్ళే.అయితే ఏ ముహూర్తాన దళపతి విజయ్ తమిళ వెట్రి కళగం అంటూ కొత్త పార్టీ పెట్టాడోగాని సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోలు పాలిటిక్స్ లోకి వరుసగా క్యూ కడుతున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.ఇక బన్నీలాంటి వారు తమ అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేయడం వాటికి మరింత బూస్టప్ ఇచ్చాయి. అయితే ఇక రూమర్స్ సర్క్యులేట్ అవడంతో అబ్బే అదేమీ లేదంటూ బన్నీ పర్సనల్ మేనేజర్ క్లారిటీ ఇవ్వడంతో వాటికి ఎండ్ కార్డ్ పడ్డ పరిస్థితి.

దళపతి విజయ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్

Advertisement

ఇక ఇపుడు దళపతి విజయ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా అడుగులు వేస్తున్నాడన్న ప్రచారం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.గతంలో తారక్ తెలుగు దేశానికి ప్రచారం నిర్వహించడం, ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనల తర్వాత తారక్ ఆ పార్టీకి దూరం అవ్వడం మనకి తెల్సిందే . ఇదిలా ఉంటె తాజాగా తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ,దానికి జులై 18న ముహుర్తం కూడా ఫిక్స్ అయిందని, తెగ డిస్కషన్స్ పెట్టేస్తున్నారు నెటిజన్లు.

also read :లెనిన్ ని ఆకాశానికి ఎత్తేసిన చిరు …ఇక కలెక్షన్ల వేట షురూ అయ్యేనా ?

Advertisement

ఈ ప్రోగ్రాం పొలిటికల్ గా ఎన్ని మంటలు పెడుతుందో

అయితే తాజగా ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ వేస్తూ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వదిలింది తారక్ టీమ్.సర్క్యులేట్ అవుతున్నట్టుగా జులై 18న అసలు ఎలాంటి పొలిటికల్ ఎంట్రీ లేదని, కేవలం తారక్ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న “ఊరు వాడ” అనే సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రాం కి ఆరోజున శ్రీకారం చుట్టబోతున్నాడని,అసలు తారక్ ఈ ప్రోగ్రాం లో ఏం చెప్పబోతున్నాడు, ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు ఉద్దేశం ఎంటనేది ప్రజల ముందుకు తీసుకురావడమే జులై 18 న జరగబోయే ఈవెంట్ ఉద్దేశమని కుండబద్దలు కొట్టేసింది .ఇక త్వరలోనే ఈ ఊరు వాడ” కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం అన్నింటిని తారక్ తన అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని, దీనిపై ఎవరూ ఎలాంటి కన్ఫ్యూజన్ లో పడొద్దని తేల్చి చెప్పింది.చూడాలి ఈ ప్రోగ్రాం పొలిటికల్ గా ఎన్ని మంటలు పెడుతుందో.

ఈ స్టార్ హీరోలు ముందు ముందు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారేమో !

ఇక తారక్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమాని యమా జోరుగా చేసుకుపోతున్న తారక్ ,దీని తర్వాత త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబందించి మేకర్స్ అఫీషియల్ పోస్ట్ వదిలారు కూడా. చూడాలి మరి ఇప్పుడే రాజకీయాలలోకి రావట్లేదు అంటూ కామా పెట్టేస్తున్న ఈ స్టార్ హీరోలు ముందు ముందు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారేమో !

also read :ఎక్కడ చూసినా ‘బాసింగ బలాలు’ మ్యాజిక్కే.. నాలుగు వారాల్లోనే ఊహించని రికార్డు!

Related News

ఎక్కడ చూసినా ‘బాసింగ బలాలు’ మ్యాజిక్కే..నాలుగు వారాల్లోనే ఊహించని రికార్డు!

లెనిన్ ని ఆకాశానికి ఎత్తేసిన చిరు …ఇక కలెక్షన్ల వేట షురూ అయ్యేనా ?

Rashmika Mandanna : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్తుందా..?

సాయి పల్లవికి పోటీగా బాలయ్య కూతురు.. ‘సారంగదరియా’ పాటకు తేజస్విని ఊరమాస్ స్టెప్పులు!

తిరుపతినైనా ఎదిరిస్తా.. నిన్ను మాత్రం వదలను మంగ.. ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్!

పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?

ఇండస్ట్రీలో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం!

Big Stories

Advertisement
×