E-Paper
Advertisement

ఎక్కడ చూసినా ‘బాసింగ బలాలు’ మ్యాజిక్కే..నాలుగు వారాల్లోనే ఊహించని రికార్డు!

ఎక్కడ చూసినా ‘బాసింగ బలాలు’ మ్యాజిక్కే..నాలుగు వారాల్లోనే ఊహించని రికార్డు!
Advertisement

Basinga Balaalu:రోడ్లపై నడిచే కార్లలో ,పొలాలు దున్నే ట్రాక్టర్లలలో, క్రికెట్ ఆడే స్టేడియాల్లో, ప్రతీ పెళ్ళిలలో, ఆ తర్వాత జరిగే బరాత్ లలో, స్కూల్ ఫంక్షన్స్ ,కాలేజీ ఈవెంట్స్ …ఇలా ఎక్కడ చూసినా ఒకటే పాట రీ సౌండ్ చేస్తుంది.అదే‘బాసింగ బలాలు’ అనే తెలంగాణ ఫోక్ సాంగ్. సతీష్ రెడ్డి బండి నిర్మాతగా శేఖర్ వైరస్ దర్శకత్వం వహిస్తూ తనే కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పుడు యూ ట్యూబ్ ని షేక్ చేస్తుంది. కళ్యాణ్ కీస్ సంగీతం అందించిన ఈ పాటలో కలిసి జంటగా కనిపించిన ఈశ్వర్ సాయి , వైష్ణవీ సోనీ తమ స్టెప్పులతో కోట్లాది మందిని తమ అభిమానులుగా మార్చేసుకున్నారు.

ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా ఎక్కేసిన పాట 

ఇక ఈ పాట విషయానికి వస్తే తెలంగాణ పెళ్లి కొడుకు తను చేసుకోబోయే భార్య గురించి , వారి సంసార జీవితం గురించి ఎలాంటి కలలు కంటారో అచ్చ పల్లెటూరు తెలంగాణ యాసలో రాశాడు స్వామి నరేష్ దుబ్బా.ఇక శ్రీనిధి అనే సింగర్ తో కలిసి పాటకి పదాలు కూర్చిన స్వామి నరేష్ దుబ్బానే ఈ పాట పాడటం ఇక్కడ విశేషం.ముఖ్యంగా పాటలో వాడిన తువాలు,కొంగు,యాది, ఎక్కిళ్ళు, బుడ్దపోరీ,దుంకి రావాలే అంటూ అచ్చ తెలంగాణ పదాలు పాటలో కూర్చడం, దాని తగ్గట్టుగానే ట్యూన్ సరిగ్గా అమరడంతో పాట ఒక్కసారిగా ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.

Advertisement

also read:డీ పండుని పరామర్శించిన శేఖర్ మాస్టర్.. అసలు హెల్త్ కండిషన్ ఏంటంటే?

కేవలం నాలుగు వారాల్లోనే 3 కోట్లకు పైగా వ్యూస్

Advertisement

ఒక్క తెలంగాణ ప్రజలే కాకుండా ఆంద్ర ప్రాంత ప్రజలు కూడా ఈ పాటని కంటిన్యూగా ప్లే లిస్టు లో రిపీట్ చేస్తుంటే, ప్రాంతాలు ఏవైనా సరిగ్గా కనెక్ట్ అయితే చాలు ,పదాలు అర్థం కాకున్నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు అనే దానికి ఈ పాటనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.ఇక ఇప్పటికే ‘పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ చిలకా’ సాంగ్ 16 కోట్లు , ‘దారిపొంటొస్తున్నాడు దవ్వదవ్వొస్తున్నాడు’ సాంగ్ 1౩ కోట్లు మరియు ‘మామిడి కోనాలమీద మబ్బులేమొ నిలిచినాయి’ పాట 3 కోట్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టి తెలంగాణా జానపదాల సత్తా చాటగా ‘నాపేరు ఎల్లమ్మ’, ‘కాపోళ ఇంటికాడ’, ‘జిల్లెలమ్మ జిట్ట’,వంటి పాటలు కూడా ఇప్పటికీ యూట్యూబ్ లో రచ్చ చేస్తున్నవే.అయితే ఈ పాట అంతకు మించి అన్నట్టుగా, ఏకంగా కేవలం నాలుగు వారాల్లోనే 3 కోట్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టడం గమనార్హం.

ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాయో!

నిజానికి ఒకప్పుడు తెలంగాణా జానపదం అంటే అంటే పల్లెల్లో, లేదా బతుకమ్మ పండగల్లోనో వినిపించేవి.అలాంటిది సోషల మీడియా పుణ్యాన ఇపుడు ఫేస్ బుక్ , ఇన్స్టాగ్రామ్ , ట్విట్టర్, ఇలా ఏ ఫ్లాట్ ఫామ్ చూసినా తెలంగాణా ఫోక్ సాంగ్సే కనిపించడం విశేషం. చూడాలి మరి బిలియన్ల వ్యూస్ ని తమ ఖాతాలో వేసుకుంటున్న ఈ పాటలు వచ్చే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాయో!ఇక ఆ పాటలోని అచ్చ తెలంగాణా పదాలు ఏంటో మీరూ ఒక లుక్కెయ్యండి !

లిరిక్స్ :

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల
అటో డజను ఇటో డజను గాజులు ఎపిస్తా పిల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే..

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే..
ఎల్లిపాయ జడేసుడే, ఎల్లిపాయా జడే
ఎన్ను పూస మీదేసుడే, ఎన్నూ పూసల మీద
కాటుక పూసుడే, కన్నుల కన్నెట్టి
దిట్టి సుక్కా పెట్టెసుడే సెంపల సెంపెట్టి

నీ యాదిల ఎక్కిళ్ళు రాబట్టే నా బుడ్డా పోరి
సేతుల మంచిల్లు తేవాలే
రెండు చేతుల మాణిక్యాలెట్టాలే నువ్వత్తా ఉంటే
ఇంటికి కల ఉట్టీ పడాలే..

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల
అటో డజను ఇటో డజను గాజులు ఎపిస్తా పిల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే..
ఎహె తగ్గేదే లేదే, నువ్వు నేను వేరు కాదే
ఇక్కడినుండి ఉంటది వేరే, నీది నాది ఒకే పేరే
నువ్వు నేను ఒక్కతిరే, కను సైగల ఎగురుడే
కాలు చెయ్యి కలుపుడే, తీనుమారుకు ఆడుడే

మనిద్దరి మంగళారతి పట్టాలే, కుడికాలు పెట్టి
ఇంట్లకు నువ్వు దుంకి రావాలే
ఒక్క గూటి పక్షులయ్ ఉండాలే, ఎదురు చూపులనే
ఇద్దరి కడుపూ నిండాలే

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉండా పిల్లగా
అటో డజను ఇటో డజను గాజులు ఏసుకుంటా మల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే

Related News

నా కళ్ళెదుటే మా నాన్న ప్రాధేయపడ్డారు.. కంటతడి పెట్టిస్తున్న భాగ్యశ్రీ కామెంట్స్!

విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?

లెనిన్ ని ఆకాశానికి ఎత్తేసిన చిరు …ఇక కలెక్షన్ల వేట షురూ అయ్యేనా ?

Rashmika Mandanna : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్తుందా..?

సాయి పల్లవికి పోటీగా బాలయ్య కూతురు.. ‘సారంగదరియా’ పాటకు తేజస్విని ఊరమాస్ స్టెప్పులు!

తిరుపతినైనా ఎదిరిస్తా.. నిన్ను మాత్రం వదలను మంగ.. ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్!

పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×