Trivikram Srinivas:మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ,విక్టరీ వెంకటేష్ హీరోగా ఆదర్శ కుటుంబం తెరకెక్కిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమా రేపే అనగా అక్టోబర్ 30న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.ఇక ఇందులో భాగంగా తాజాగా ఏర్పాటు చేసిన రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.
త్రివిక్రమ్ కి ఎంతో నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆయన సినిమాలు ఎప్పుడూ కుటుంబం, మానవ సంబంధాల చుట్టూనే ఎందుకు తిరుగుతుంటాయి, వాటిని దాటి కొత్త ప్రపంచంలోకి ఎందుకు వెళ్లడం లేదు అంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి త్రివిక్రమ్ ఇస్తూ “మనుషులు తప్ప ఇంకేముందండి? మనుషులు, వాళ్ల సంబంధాలు తప్పితే ఈ ప్రపంచంలో ఇంకేముంది?” అంటూ సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. కథ ఏదైనా, ప్రపంచం ఎంత మారినా చివరిగా మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ , బంధాలే ముఖ్యమని కుండ బద్దలు కొట్టారు.
ఇక గతంలో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు ఆడియన్స్ ని ఎంతలా అలరించాయో చెప్పక్కర్లేదు.ఇదే విషయన్ని ఒక అభిమాని గుర్తుచేస్తూ, తమ చిన్నతనాన్ని రీవైండ్ చేసినట్లు ఉండే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరగా త్రివిక్రమ్ మాట్లాడుతూ తాము చేసే ప్రతి సినిమా ఒక ప్రయత్నం మాత్రమేనని,ప్రేక్షకులకు నచ్చాలనే ఉద్దేశంతోనే కథలు రాస్తాం కానీ, పూర్తిగా వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటూ రాస్తే అసలు పని చేయలేమని ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూనే, తమ మనసుకు వచ్చిన ఆలోచనను నిజాయితీగా తెరపై చూపించడమే తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు.
సినిమా కథలకు కులం, మతం, ప్రాంతం లేదా భాష అనే హద్దులు ఉండవని ఎమోషన్స్ అనేవి అందరికీ ఒక్కటే కాబట్టి, మనకు తెలుగు సినిమా ఎంత నచ్చుతుందో తమిళం, మలయాళం లేదా ఇంగ్లీష్ సినిమాలు కూడా అంతే బాగా నచ్చుతాయని వివరించారు. ఇక ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్ గురించి మాట్లాడుతూ, మనం కావాలని ప్రయత్నిస్తేనే ఒక కథ పాన్ ఇండియా స్థాయికి వెళ్లదని చెప్పారు. మనం రాసుకున్న కథలో ఆ బలం ఉంటే, అదే మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుందని స్పష్టం చేశారు.
ఇక వెంకటేష్‌తో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ గతంలో రచయితగా వెంకటేష్‌తో ఆఫీస్‌లో కూర్చుని కథలు, డైలాగులు చర్చించేవాడినని, కానీ ఈసారి డైరెక్టర్‌గా ఆయనను కెమెరా ముందుకు నడిపించడం ఒక మ్యాజికల్ అనుభూతి అని చెప్పారు. వెంకటేష్ గారికి కెమెరా, షాట్స్ పై ఉన్న అవగాహన వల్ల షూటింగ్ చాలా స్పీడ్ గా కంప్లీట్ అయిందని తన ఆనందాన్ని పంచుకున్నారు.
చివరగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కేవలం నవ్వులు, సరదాలు లేదా కలిసి ఉండటం మాత్రమే కాదని చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలబడటం, ప్రమాదం వచ్చినప్పుడు తమ వారిని కాపాడుకోవడమే ఈ కథలోని అసలైన ఆత్మ అని చెప్పుకొచ్చారు గురూజీ.చూడాలి మరి అంచనాలని ఒక రేంజ్ లో పెట్టేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
ALSO READ :అర్జున్ రెడ్డి బ్యూటీ అందాల షో.. మామూలుగా లేదుగా!