E-Paper
Advertisement

బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026.. జానపద గీతాలకు అదిరిపోయే స్టెప్స్ వేసేద్దామా? ఎప్పుడు.. ఎక్కడంటే?

బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026.. జానపద గీతాలకు అదిరిపోయే స్టెప్స్ వేసేద్దామా? ఎప్పుడు.. ఎక్కడంటే?
Advertisement

Big TV Folk Night 2026: చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఎన్నో రకాల మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. అయితే బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఫోక్ మ్యూజికల్ నైట్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కూడా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన ఆదరణ లభించిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఫోక్ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ బాగంగా జానపద పాటలతో ఫోక్ సింగర్స్ అంతా ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు.

బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026..

ఇక ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 12వ తేదీ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ గచ్చిబౌలిలో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఫోక్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, సింగర్ మంగ్లీ, ఫోక్ డాన్సర్ గా గుర్తింపు పొందిన నాగ దుర్గ, వందేమాతరం శ్రీనివాస్, రాము రాథోడ్ వంటి తదితరులు పాల్గొనబోతున్నారు. ఈ అద్భుతమైన వేడుకకు ఉదయభాను యాంకర్ గా వ్యవహరించబోతున్నారు. ఇలా జానపద పాటలకు అదిరిపోయి చెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి బిగ్ టీవీ సిద్ధమైంది. ఇదివరకు ఎంతోమంది సినిమాలలో పాటల కోసం మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహిస్తూ వచ్చారు కానీ బిగ్ టీవీ మాత్రం ఇందుకు భిన్నంగా జానపద పాటలను ప్రోత్సహిస్తూ ఇలా ఫోక్ మ్యూజికల్ నైట్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు.

జానపద కళలకు ప్రాణం పోసేలా..

Advertisement

జానపద పాటలను ఇష్టపడే శ్రోతలు బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026 (Big tg folk night 2026) కార్యక్రమంలో పాల్గొని జానపద పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. పాటలంటే పాట అనే విధంగా కాకుండా జానపద కళకు ప్రాణం పోసేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇటీవల కాలంలో జానపద కళలకు ప్రాధాన్యత తగ్గిపోతున్న నేపథ్యంలో జానపద పాటలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బిగ్ టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

Advertisement

బిగ్ టీవీ ఫోక్ నైట్ మిషన్ ద్వారా తెలంగాణ జానపద వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జానపద కళాకారులను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి జానపద పాటల గొప్పతనాన్ని, సాంస్కృతిక ప్రాముఖ్యతను నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా నిర్వహించబడుతుంది. గతంలో నిర్వహించిన ఈ ఫోక్ నైట్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది మరి డిసెంబర్ 12వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Also Read: ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. గిరిబాబు అందుకున్న పురస్కారాలు ఇవే!

Related News

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం.. అసలేం జరిగిందంటే?

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. గిరిబాబు అందుకున్న పురస్కారాలు ఇవే!

గిరిబాబు తెలుగులో నటించిన చివరి చిత్రం ఇదే!

గిరిబాబు మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఆ ఒక్క హీరోతో 150 సినిమాలలో కలిసి నటించిన గిరిబాబు!

గిరిబాబుకు తీరని కోరిక అదేనా? పుట్టిన రోజంటే ఊరంతా పండుగేనా?

గిరిబాబు పై సీనియర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించిన మూవీ.. ఏదో.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×