E-Paper
Advertisement

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. గిరిబాబు అందుకున్న పురస్కారాలు ఇవే!

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. గిరిబాబు అందుకున్న పురస్కారాలు ఇవే!
Advertisement

Actor Giri Babu: గిరిబాబు టాలీవుడ్ సినీ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన నేడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు ఐదు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఏకంగా 600కు పైగా సినిమాలలో నటించిన ఘనత గిరిబాబు (Giribabu)కి ఉంది. విలన్ గా ఈయన సినీ ప్రస్థానం మొదలైనప్పటికీ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొనసాగారు.. ఇండస్ట్రీలో చెరగని ముద్ర సంపాదించుకున్న గిరిబాబు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఈయన నవంబర్ 11వ తేదీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు…

ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గిరిబాబు ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కన్నుమూశారు. ఈయన మరణించడంతో సినీ ప్రముఖులు ఈయన మరణం పట్ల సానుభూతి తెలియజేస్తున్నారు. ఇలా గిరిబాబు మరణించడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గిరిబాబు తన ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో అందుకున్న పురస్కారాలు ఏంటి అని విషయానికి వస్తే.. గిరిబాబు విజయవంతంగా 50 సంవత్సరాల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవడంతో ఈయనకు సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.

గౌరవ డాక్టరేట్..

Advertisement

ఇలా 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇండస్ట్రీకి విశేషమైన సేవలు అందించినందుకు గాను ఈయన సేవలను గుర్తించి 2021 లో సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందించారు.కళారంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను 2012లో గౌరవ డాక్టరేట్ లభించింది.అదేవిధంగా తెలుగు సినీ రంగంలో ఆయన సుదీర్ఘ ప్రయాణాన్ని గౌరవిస్తూ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై ప్రత్యేక పురస్కారాలతో గౌరవించారు. ఈ పురస్కారాలతో పాటు ఈయన వివిధ సాంస్కృతిక సంస్థలు, సినీ వేదికల నుండి జీవన సాఫల్య పురస్కారాలను. అందుకున్నారు.

గిరి బాబు చివర సినిమా…

ఇలా గిరిబాబు తన 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎంతో అత్యున్నతమైన పురస్కారాలను అందుకున్నారు. ఇక ఈయన 1973 వ సంవత్సరంలో జగమే మాయ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. విలన్ గా 70 వ దశకంలో గుర్తింపు పొందిన గిరిబాబు అనంతరం హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు చేశారు. ఇక ఇటీవల ఈయన తండ్రి, తాత పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇక చివరిగా ఈయన అన్నీ మంచి శకునములే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఈ సినిమా గిరిబాబు ఆఖరి సినిమా కావడం గమనార్హం.ఈ సినిమా తరువాత గిరిబాబు వెండితెర పై కనిపించలేదు.

Advertisement

Also Read: ముఖేష్ కు కాళ్లు మొక్కడంపై వర్షిణి మదర్ రియాక్షన్… రామకృష్ణకు క్షమాపణలు!

Related News

గిరిబాబు తెలుగులో నటించిన చివరి చిత్రం ఇదే!

గిరిబాబు మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఆ ఒక్క హీరోతో 150 సినిమాలలో కలిసి నటించిన గిరిబాబు!

గిరిబాబుకు తీరని కోరిక అదేనా? పుట్టిన రోజంటే ఊరంతా పండుగేనా?

గిరిబాబు పై సీనియర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించిన మూవీ.. ఏదో.. ఎందుకో తెలుసా?

ఇదేం ట్విస్ట్ సామి.. ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా.. థియేటర్లలో నవ్వుల జాతరే!

గిరిబాబు హీరోగా నటించిన సినిమాలు ఇవే!

Big Stories

Advertisement
×