E-Paper
Advertisement

గిరిబాబు మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

గిరిబాబు మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

Chiranjeevi:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏకంగా ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాలలో నటించి తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు గిరిబాబు (Giribabu ). సీనియర్ నటులుగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. తన వారసులైన రఘు బాబు(Raghu Babu) , బోస్ బాబులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా , ప్రతి నాయకుడిగా, హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. నవంబర్ 14న అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. సీనియర్ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న గిరిబాబు మరణం.. సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కలిచి వేసింది. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు గిరిబాబు మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గిరిబాబు మరణం పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక ఎమోషనల్ పోస్టు పంచుకున్నారు. చిరంజీవి అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా.. “ప్రముఖ నటుడు గిరిబాబు ఇకలేరన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన విలక్షణమైన నటన, ప్రత్యేక శైలి ద్వారా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా పలు రకాల చిత్రాలకు, గిరిబాబు తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు పూడ్చలేని నష్టం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ” అంటూ చిరంజీవి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గిరిబాబు – చిరంజీవి కలయికలో వచ్చిన చిత్రాలు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి , సీనియర్ నటుడు గిరిబాబు కాంబినేషన్లో ప్రధానంగా 1970 చివరి నుండి 2000 సంవత్సరం మధ్యకాలం వరకు అనేక క్లాసిక్ తెలుగు చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా వీరి మధ్య ఎక్కువగా హీరో – విలన్ పాత్రలు, కామెడీ – కుటుంబ ఆధారిత సహాయ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విషయానికి వస్తే.. ఆరని మంటలు, శివుడు శివుడు శివుడు, కోతల రాయుడు, మహానగరంలో మాయగాడు, విజేత, దొంగ మొగుడు, పసివాడి ప్రాణం, జేబుదొంగ, అల్లుడా మజాకా, అందరివాడు ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

also read:ఆ ఒక్క హీరోతో 150 సినిమాలలో కలిసి నటించిన గిరిబాబు!

82 సంవత్సరాల వయసులో గిరిబాబు మృతి..

Advertisement

45 సంవత్సరాల సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాలలో నటించిన గిరిబాబు.. 2023 వరకు సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అలాంటి ఈయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నవంబర్ 11 2026న సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. వయసు మీద పడడంతో నవంబర్ 14 2026న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ కిమ్స్ హాస్పిటల్ అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Related News

ఆ ఒక్క హీరోతో 150 సినిమాలలో కలిసి నటించిన గిరిబాబు!

గిరిబాబుకు తీరని కోరిక అదేనా? పుట్టిన రోజంటే ఊరంతా పండుగేనా?

గిరిబాబు పై సీనియర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించిన మూవీ.. ఏదో.. ఎందుకో తెలుసా?

ఇదేం ట్విస్ట్ సామి.. ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా.. థియేటర్లలో నవ్వుల జాతరే!

గిరిబాబు హీరోగా నటించిన సినిమాలు ఇవే!

వందల సినిమాలలో నటించిన గిరిబాబు.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

Big Stories

Advertisement
×