E-Paper
Advertisement

గిరిబాబు తెలుగులో నటించిన చివరి చిత్రం ఇదే!

గిరిబాబు తెలుగులో నటించిన చివరి చిత్రం ఇదే!
Advertisement

Giribabu Last Movie: చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, సినీ నటుడిగా, నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్న గిరిబాబు (Giribabu ) 82 సంవత్సరాల వయసులో మృతి చెందారు. వయస్సు మీద పడడంతో వచ్చే అనారోగ్య సమస్యలతో నవంబర్ 11న సికింద్రాబాద్, కిమ్స్ హాస్పిటల్ లో చేరగా చికిత్స తీసుకుంటూ ఆయన నవంబర్ 14 మధ్యాహ్నం 3:18 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త బయటకు రావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు గిరిబాబు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గిరిబాబుకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఆయన నటించిన చివరి చిత్రం. మరి గిరిబాబు నటించిన ఆ చివరి చిత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గిరిబాబు నటించిన చివరి సినిమా..

చిన్నప్పటినుండే నాటక రంగం పట్ల ఆసక్తి పెంచుకున్న గిరిబాబు.. ఆ ఆసక్తితోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1973లో వచ్చిన ‘జగమే మాయ’అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 45 సంవత్సరాల సినీ కెరియర్లో 600కు పైగా చిత్రాలలో నటుడిగా, హీరోగా నటించిన ఈయన దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలకు పనిచేశారు. ఇకపోతే ఆయన చివరిగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. 2023లో విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. స్వప్న సినిమాస్ , మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్లపై స్వప్న దత్ , ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. మాళవికా నాయర్, రాజేంద్రప్రసాద్ , గౌతమి , సంతోష్ శోభన్, నరేష్ , రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2023 మే 18 విడుదలై ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో గిరిబాబు జడ్జి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇదే ఆయన చివరి సినిమా కావడం గమనార్హం.

Advertisement

also read: గిరిబాబు మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

గిరిబాబు వ్యక్తిగత జీవితం..

గిరిబాబు వ్యక్తిగత జీవితానికి విషయానికొస్తే ఈయనకు రఘుబాబు, బోస్ బాబు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇండస్ట్రీలో రఘు బాబు యాక్టివ్ గా ఉన్నారు. విలన్ గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక గిరిబాబు చిన్న కొడుకు బోస్ బాబు ఇంద్రజిత్తు అనే సినిమాలో నటించారు.. ఆ తర్వాత ఆయన పెద్దగా మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు.. ప్రస్తుతం వ్యాపారాల పైన ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిరిబాబు భార్య శ్రీదేవి 2016 మే 12న మూత్రపిండాల వ్యాధితో మరణించారు. భార్య మరణం తర్వాత సరిగ్గా 10 ఏళ్లకు గిరిబాబు మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే కొడుకును హీరోగా చేయాలని ఎన్నో కలలు కన్న గిరిబాబు ఆ కోరిక నెరవేరకుండానే మరణించడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.. మొత్తానికైతే గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

గిరిబాబు మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఆ ఒక్క హీరోతో 150 సినిమాలలో కలిసి నటించిన గిరిబాబు!

గిరిబాబుకు తీరని కోరిక అదేనా? పుట్టిన రోజంటే ఊరంతా పండుగేనా?

గిరిబాబు పై సీనియర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించిన మూవీ.. ఏదో.. ఎందుకో తెలుసా?

ఇదేం ట్విస్ట్ సామి.. ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా.. థియేటర్లలో నవ్వుల జాతరే!

గిరిబాబు హీరోగా నటించిన సినిమాలు ఇవే!

వందల సినిమాలలో నటించిన గిరిబాబు.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×