Indian Team Celebrating Aggressively in Front of Hamza Zahoor: అండర్ 19 వన్డే ఆసియా కప్ టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026) నేపథ్యంలో ఫైనల్ లో గెలిచిన టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి బౌండరీ బాది మోహిత్ ఉల్వా టీమిండియాను గెలిచిపించాడు. ఈ క్రమంలోనే గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన టీమిండియా యువ క్రికెటర్లు అగ్రెసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందులో ఓ భారత యువ క్రికెటర్ (మనాల్ చౌహాన్)… పాక్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor) ముందు రెచ్చిపోయాడు.
అతని ముందు గట్టిగా అరుస్తూ, సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి హంజాతో పాటు పాక్ ప్లేయర్లు డగౌట్ కు వెళ్లిపోయారు. అయినా భారత క్రికెటర్లు తగ్గలేదు. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూం వైపు దూసుకెళ్లారు. అసభ్య సైగలు చేస్తూ, పాకిస్తాన్ ప్లేయర్లను రెచ్చగొట్టారు. ఈ క్రమంలోనే టీమిండియా కోచ్ కనిత్కర్, ఇతర సిబ్బంది వాళ్లను ఆపింది. లేకపోయింటే, స్టేడియంలో పెద్ద గొడవే జరిగేది. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. వీటిని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. యువ భారత క్రికెటర్లు ఇంత వైల్డ్ గా ఉన్నారేంటి అంటూ వాపోతున్నారు.
అండర్ 19 వన్డే ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్స్ లో విజయం సాధించిన తర్వాత యువ భారత క్రికెటర్లు రెచ్చిపోయి ప్రవర్తించారు. పాకిస్తాన్ ప్లేయర్లపైకి దూసుకెళ్లారు. మొన్న గ్రూప్ స్టేజ్ లో ఇలాగే పాక్ ప్లేయర్లు ఓవరాక్షన్ చేశాడు. అందుకే ఫైనల్ గెలిచిన తర్వాత మనోళ్లు చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ మాజీలు సీరియస్ అవుతున్నారు. గెలిచిన బలుపుతో పాక్ ప్లేయర్లపై దాడులు చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. వీధి రౌడీల్లా టీమిండియా రెచ్చిపోయిందని సీరియస్ అవుతున్నారు. గొడవ చేసిన టీమిండియా యువ ప్లేయర్లపై ఐసీసీ వెంటనే బ్యాన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనిపై టీమిండియా మాజీలు మాత్రం డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. గ్రూప్ స్టేజ్ లో గెలిచినప్పుడు పాక్ ప్లేయర్లు కూడా ఇంతకంటే ఎక్కువగానే ఓవర్ చేశారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. దెబ్బకు దెబ్బ అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా, ఎట్టకేలకు ట్రోఫీ దక్కించుకుంది. నఖ్వీ రాకపోవడంతో ఒమన్ కు చెందిన ఏసీసీ సభ్యుడు టీమిండియాకు ట్రోఫీ అందించాడు.
Currently BCCi players are the aash whole of world cricket 🤡
First Gurnoor brar showed pathetic behaviour in newzealand being a guest to Blackcaps in their home
Now their youngsters are mocking a third grade team pakistan and think world cricket goona clap for them..
Nonsense pic.twitter.com/eD3Iu1L8bJ
— PSJD (@P1psjdofficial) November 14, 2026
Just look at the way India U19 player celebrating by going up to the Pakistani players and shouting in front of them after victory.🥶🔥 pic.twitter.com/VOkP85Ww5A
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 14, 2026