Actress Malvika Raaj: ప్రముఖ హీరోయిన్ మాల్విక రాజ్ బగ్గా గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులంతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి ఆమె శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా మాల్విక బగ్గా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కబీ ఖుషి కభీ గమ్’ చిత్రంతో బాలీవుడ్లో మంచి గర్తింపు పొందింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఆమె సహాయక నటిగా, లీడ్ రోల్లో నటించింది. ఈ క్రమంలో 2023లో ప్రణవ్ బగ్గాను పెళ్లాడింది ఈ ముద్దుగ్గుమ్మ. పెళ్లయిన రెండేళ్లకు గర్భం దాల్చింది. గత మే నెలలో తాను తల్లికాబోతున్నట్టు ప్రకటించింది.
ఈ క్రమంలో తరచూ తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ని అలరించింది. మే నెలలో గర్భం దాల్చిన మాల్విక రెండు రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిన్న సాయంత్రం ఇన్స్టాగ్రామ్ వేదిక వెల్లడిచింది. 23 ఆగస్టున తనకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని తెలిపింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేయగా.. ఆమెకు సినీ ప్రముఖులు, సహా నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హ్రుతిక్ రోషన్, కరీనా కపూర్లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ మూవీ కబీ ఖుషి కభీ గమ్ 2001లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో మాల్విక రాజ్ ఓ కీలక పాత్ర పోషించింది. కరీనా కపూర్కి టీనేజ్ గర్ల్ గా కనిపించిన ఆమె పాత్ర బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పలు సినిమాలు, సీరియల్లో నటిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.
Also Read: Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. సందీప్‌రెడ్డి వంగా ఎమోషనల్
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==