Sandeep Reddy Vanga Emotional: విజయ్ దేవరకొండ కెరీర్‌లో మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2017లో విడుదలైంది. నేటితో ఈ సినిమా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. హీరోకి, డైరెక్టర్ జీవితాన్ని మలుపు తిప్పిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేసింది. ఓ వైపు విమర్శలు ఎదుర్కొంటూనే.. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత ఎంతో నెగిటివిటీని మూటగట్టుకుంది. మహిళ సంఘాలు ఈ చిత్రాన్ని వ్యతిరేకించాయి. సందీప్ రెడ్డి వంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
అర్జున్ రెడ్డికి ఎనిమిదేళ్లు..
అయినా యూత్‌ని ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. హిందీలో రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టిన ఈ చిత్రం విడుదలైన నేటికి ఎనిమిదేళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమాని గుర్తు చేసుకుంటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. మూవీ సెట్‌లోని విజయ్‌తో మాట్లాడుతున్న వీడియోని షేర్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా ఇలా రాసుకొచ్చారు. “ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నా మనసుకు, నాకు ఎంతో దగ్గరైన కథ ఇది. కేవలం మీ అంతులేని మద్దతు, ప్రేమ వల్లే అర్జున్ రెడ్డి ఇంత పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేం, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్కు ఒక అర్థం వచ్చిందంటే.. దాన్ని మీరు ఎంతో ఇష్టంగా, నిజాయితీగా స్వీకరించడమే కారణం’ అంటూ సందీప్ రెడ్డి వంగా ఎమోషనల్ అయ్యారు.
ప్రతి ఒక్కరి థ్యాంక్స్
అదే విధంగా ఈ మూవీ టీంకి, నటీనటులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇన్నేళ్లయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇప్పటీకి తాజాగా, సహజంగా, సజీవంగా అనిపిస్తున్న అర్జున్ రెడ్డి ఎనిమిదేళ్ల ప్రయాణానికి ధన్యవాదాలు. ఈ సినిమాను శాశ్వతంగా గుండెల్లో నిలిపినందుకు ప్రతి ఒక్కరి థ్యాంక్స్’ అంటూ సందీప్ రెడ్డి వంగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన ఈచిత్రం ఎనిమిదేళ్ల క్రతం సంచలన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేసింది. భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది.
Also Read: Ghaati Movie: అనుష్క ‘ఘాటి’ హక్కులు తీసుకున్న స్టార్ హీరో..
కానీ, ఓ వర్గం ఆడియన్స్ మాత్రం మూవీపై వ్యతిరేకత చూపించారు. ఇందులో మహిళలను కించపరిచేలా చూపించారని, ఓ డాక్టర్ డ్రగ్స్ వాడటం చూపించారంటూ ట్రోల్ చేశారు. ఇలాంటి సినిమాతో సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని, మూవీని బ్యాన్ చేయాలని డిమాండ్స్ వచ్చాయి. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. విజయ్ కెరీర్ అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ కెరీర్ అలాంటి పెద్ద హిట్ మళ్లీ రాలేదు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కోసం విజయ్ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ మంచి విజయం సాధిస్తాడనుకుంటే అవన్నీ బ్యాక్ టూ బ్యాక్ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==