Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఎక్కువగా ప్రేమలో ఓడిపోతుంటారట. వారి ప్రేమించిన వ్యక్తులు వీరిని మోసం చేస్తుంటారట. అలాగే మిగతా తేదీలలో పుట్టిన వారి జీవితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
సూర్య సంఖ్య1: ఏ నెలలో అయినా ఒకటి, పది, పందొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారు సూర్య సంఖ్య కిందకు వస్తారు. వీరికి అతిగా ఆత్మగౌరవం ఉంటుంది. అహంకారం కూడా అలాగే ఉంటుంది. తామే ఎప్పుడూ కరెక్టు అనుకుంటారు. దీంతో ఇతరులు సలహాలు పట్టించుకోరు. వీళ్లకు అసలు ఓర్పు ఉండదు. దీనివల్లే వీరికి సంబంధాలు దెబ్బతింటాయి. నాయకత్వ లక్షణాలు ఉన్నా వాటిని అహంకారంగా మార్చుకుంటారు.
చంద్ర సంఖ్య 2: ఏ నెలలో అయినా రెండు, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన వారిని చంద్ర జాతకులు అంటారు. వీరికి బావేద్వేగం ఎక్కువగా ఉంటుంది. మూడ్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడుతుంటారు. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఇతరులపై బలంగా ఆధార పడతారు. స్వతంత్రత తక్కువగా ఉంటుంది.
గురు సంఖ్య 3: ఏ నెలలో అయినా మూడు, పన్నెండు, ఇరవై ఒకటి, ముఫ్పై తేదీలలో పుట్టిన వారిని గురు జాతకులు అంటారు. వీరు ఉపదేశం ఇవ్వడంలో ముందుంటారు. ప్రాక్టికల్ గా పాటించడంలో వెనక ఉంటారు. ఇతరులను మించి తామే ఎక్కువ తెలుసుకున్నట్టు ప్రవర్తిస్తారు. డిసిప్లిన్ లేకపోతే పెద్ద అవకాశాలను కోల్పోతారు. అధిక ఆశలు పెట్టుకోవడం వల్ల నిరాశ చెందుతారు.
రాహు సంఖ్య 4: ఏ నెలలో అయినా నాలుగు, పదమూడు, ఇరవై రెండు, ముఫ్పై ఒకటి తేదీలలో పుట్టిన వారిని రాహు జాతకులు అంటారు. వీరిలో తిరుగుబాటు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా గందరగోళానికి గురవుతుంటారు. స్విరత్వం లేకుండా అకస్మాత్తుగా నిర్ణయాలు మార్చుకుంటారు. భౌతిక లోకానికి బానిసవుతారు. వీళ్లు ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం నిరాశ కల్గిస్తుంది.
బుధ సంఖ్య 5: ఏ నెలలో అయినా ఐదు, పద్నాలుగు, ఇరవై మూడు తేదీలలో పుట్టిన వారిని బుధ జాతకులు అంటారు. వీరికి చంచల స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా స్తిరత్వం లేకపోవడం. ఒకే పనిలో ఎక్కువ కాలం ఫోకస్ చేయకపోవడం. తొందరపాటు నిర్ణయాలు ఈ జాతకులకు శాపాలుగా మారతాయి.
శుక్ర సంఖ్య 6: ఏ నెలలో అయినా ఆరు, పదిహేను, ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వారిని శుక్ర జాతకులు అంటారు. వీరికి ఆడంబరం ఎక్కువగా ఉంటుంది. విలాసాలలో ముగినిపోవడం వీరి బలహీనత. ప్రేమలో ఎక్కువగా విఫలం అయ్యేది ఈ జాతకులే. వీరు ప్రేమ కోసం మిగతా విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి.
కేతు సంఖ్య 7: ఏ నెలలో అయినా ఏడు, పదహారు, ఇరవై అయిదు తేదీలలో పుడతారో వారిని కేతు జాతకులు అంటారు. వీరికి విమర్శనాత్మకమైన ధోరణి ఉంటుంది. ఇతరులతో కలిసిపోకుండా ఒంటరిగా ఉండిపోతుంటారు. ఎక్కువగా ఆధ్యాత్మికంగా బతకడానికి ఇష్టపడతారు. దీంతో వాస్తవాన్ని అసలు పట్టించుకోరు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ సందేహిస్తారు.
శని సంఖ్య 8: ఏ నెలలో అయినా ఎనిమిది, పదిహేడు, ఇరవై ఆరు తేదీలలో పుడతారో వారిని శని జాతకులు అంటారు. వీరి ఏ పని చేసినా నిదానంగా చేస్తారు. స్పీడు అనేది వీరి జీవితంలో ఉండదు. దీంతో చాలా విషయాల్లో నష్టపోతుంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం అంతంతమాత్రమే. ఒకవేళ విజయం సాధించినా అది కూడా ఆలస్యంగా వస్తుంది. జీవితంలో ఎక్కువ మలుపులు ఉంటాయి.
కుజ సంఖ్య 9: ఏ నెలలో అయినా తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వారిని కుజ జాతకులు అంటారు. వీరికి అధిక కోపం, ఆవేశం ఉంటాయి. ఆలోచించకుండా పనులు చేయడానికి పూనుకుంటారు. ఇతరుల కోసం త్యాగం చేసి తాము నష్టపోతుంటారు. తమలోని సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేక జీవితంలో విఫలం అవుతుంటారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.