IRCTC Site Down: వరుసగా పండుగలు రాబోతున్నాయి. వినాయక చవితి, దసరా, దీపావళి, ఛత్ పూజా వరకు ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయి. పండుగలకు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగల సీజన్ కావడంతో రైల్వే టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పరిమితికి మించి బుకింగ్స్ రావడంతో IRCTC వెబ్ సైట్ క్రాష్ అయ్యింది. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
ముజఫర్ పూర్ డివిజన్ లో ఇబ్బందులు
ముఖ్యంగా బీహార్ లోని ముజఫర్ పూర్ డివిజన్ పరిధిలోని ప్రజలు రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. IRCTC వెబ్ సైట్ పదే పదే క్రాష్ అవుతోంది. ప్రయాణీకులు బుకింగ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. అయితే, ఏజెంట్లు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుడా సులభంగా టికెట్లను బుక్ చేస్తున్నారు. సామాన్యులకు మాత్రమే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సమస్యలను తొలగించి, సజావుగా టికెట్ల బుకింగ్ కొనసాగేలా చూడాలని కోరుతున్నారు.
పదే పదే వెబ్ సైట్ క్రాష్
RCTC వెబ్ సైట్ తెరిచిన వెంటనే, ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. కానీ, వెబ్ సైట్ పదేపదే క్రాష్ అవుతున్నట్లు గుర్తించారు. మొదట సీటు అందుబాటులో ఉన్నట్లు వెబ్ సైట్ లో కనిపిస్తుందని, బుకింగ్ కొనసాగిన వెంటనే సీటు అందుబాటులో లేదని, వెయిటింగ్ లిస్ట్ అనే సందేశం వస్తుందని ప్రయాణికులు వెల్లడించారు. చాలాసార్లు IRCTC API, CURL Air 28కి కనెక్ట్ కాలేకపోతున్నట్లు అధికారులు గుర్తించారు.
Read Also: పండుగ సీజన్ లో కన్ఫార్మ్ టికెట్ కావాలా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి!
వెబ్ సైట్ సమస్యలతో ప్రయాణీకుల ఇబ్బందులు
పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లేందుకు చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సైట్ లో సాంకేతిక సమస్యల కారణంగా టికెట్లు బుక్ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. తాము టికెట్లు బుక్ చేయలేక ఇబ్బందులు పడుతుంటే, టికెట్ బుకింగ్ ఏజెంట్లు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా టికెట్లు బుక్ చేస్తున్నట్లు ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా సాంకేతిక లోపాలను తొలగించాలని కోరుతున్నారు. పదే పదే సైట్ క్రాష్ కాకుండా చూడాలని RCTCని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ ఇన్ని రకాలుగా తెలుసుకోవచ్చా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియక…