Heroine : సినీ ఇండస్ట్రీలోని జంటల మధ్య ఎప్పుడూ మనస్పర్ధలు వస్తాయో? ఎవరు సడన్గా విడాకులను ప్రకటిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ మధ్య స్టార్ హీరోలతో పాటుగా హీరోయిన్లు కూడా విడాకులు ప్రకటిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ హన్సిక అని కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. హీరోయిన్లు తమ భర్తలను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన లేదంటే ఫోటోలు డిలీట్ చేసిన కూడా ఇండస్ట్రీ ఉలిక్కి పడుతుంది. ఎప్పుడు విడిపోయామని ప్రకటిస్తారు అని అభిమానులు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. తాజాగా మరో హీరోయిన్ ఐదేళ్ల బంధానికి గుడ్ బై చెప్పేసింది.. ఆమె ఎవరో కాదు ప్రభాస్ తరసన ఓ సినిమాలో నటించింది. ఎందుకు తన భర్తతో విడాకులు తీసుకుంది అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
భర్తతో విడాకులు తీసుకున్న క్రేజీ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవలిన్ శర్మ.. జర్మనీకి చెందిన ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీలో ఓ కీ రోల్లో నటించింది.. వ్యాపారవేత్త తుషాన్ భిండితో 2019 అక్టోబర్‌లో ఎవలిన్ శర్మకు నిశ్చితార్ధం జరిగింది.. 2021 మేలో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని లీవ్ చేస్తూ సినిమాలకు దూరమైంది ఈ బ్యూటీ.. ఎవలిన్ శర్మ- తుషాన్‌లు విడిపోతున్నట్లుగా గతంలోనే గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈమె ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.. తన భర్తతో కొన్ని కారణాలవలే విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రకటించింది.. ప్రస్తుతం ఇది బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..
Also Read :పెళ్లి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. అంత మాట అనేసిందేంటి..?
బాలీవుడ్ బ్యూటీ ఎవలిన్ శర్మ మొదట మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొని తన అందాలతో జనాలని ఆకట్టుకుంది. టర్న్ లెఫ్ట్ అనే హాలీవుడ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు. మొదటి మూవీతో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.. ఈమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. యే జవానీ హై దీవానీ, నౌటంకి సాలా, ఇష్క్, యారియన్, కుచ్ కుచ్ లోచా హై ఇష్కేదారియన్ వంటి సినిమాల్లో నటించింది. ఇక టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే ఉద్దేశంలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.