E-Paper
Advertisement

Film industry: పిల్లలకు ఫీజు కట్టలేని స్థితిలో స్టార్ హీరోయిన్.. అసలేం జరుగుతోంది?

Film industry: పిల్లలకు ఫీజు కట్టలేని స్థితిలో స్టార్ హీరోయిన్.. అసలేం జరుగుతోంది?
Advertisement

Film industry:బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ( Karishma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (Sanjay Kapoor) మరణంతో వారి కుటుంబంలో ఆస్తి వివాదాలు చెలరేగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆస్తి విషయంలో కరిష్మా కపూర్ పిల్లలు ఇద్దరు కోర్టుకు వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. కానీ సంజయ్ కపూర్ రెండో భార్య.. కరిష్మా కపూర్ పిల్లలకు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే చాలా ఇచ్చానని చెప్పింది.ఈ నేపథ్యంలోనే తాజాగా కరిష్మా కపూర్ పిల్లలు ఢిల్లీ హైకోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న మేము.. మా ఫీజులు రెండు నెలలుగా చెల్లించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైరా కపూర్ మరియు ఆమె సోదరుడు తమ దివంగత తండ్రి సంజయ్ కపూర్ ఆస్తి రావాలి అని కోర్టుకెక్కారు. కానీ సంజయ్ కపూర్ తన వీలునామాలో వేరే విధంగా రాసారని సంజయ్ కపూర్ రెండో భార్య చెప్పింది. కానీ ఆ వీలునామాను సవాల్ చేస్తూ సంజయ్ కపూర్ మొదటి భార్య పిల్లలు కోర్టుకెక్కారు..

పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితి..

అయితే కరిష్మా కపూర్ పిల్లల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది మహేష్ జెట్మిలాని చెప్పిన దాని ప్రకారం.. పిల్లల పెంపకం మరియు విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులు సంజయ్ కపూర్ భరించాల్సిందే అని వాదించారు. ఎస్టేట్ ప్రస్తుతం సంజయ్ రెండో భార్య ప్రియా సచిదేవ్ నియంత్రణలో ఉన్నందున అమెరికాలోని విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమైరాకు రెండు నెలలుగా ఫీజులు చెల్లించబడలేదని పిల్లల తరపు న్యాయవాది పేర్కొన్నారు.. కానీ ప్రియా సచ్ దేవ్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ నాయర్ మాత్రం ఈ ఆరోపణలు నిరాధారణమైనవని, కల్పితమైనవని తోసిపుచ్చారు.

Advertisement

ALSO READ:Prithviraj Sukumaran: విమర్శించే హక్కు వారికి ఉంది.. జ్ఞానోదయం కల్పిస్తున్న కుంభ!

మీడియా దృష్టిని ఆకర్షించడమే లక్ష్యమా?

ప్రియా నిరంతరం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని, మరియు వారి విశ్వవిద్యాలయ ఫీజులతో సహా అన్ని బకాయిలు ఇప్పటికే కట్టింది అంటూ ఆయన వాదించారు.. అంతేకాదు ఫీజు సంబంధిత ఆరోపణలను కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికే బయటపెట్టారని రాజీవ్ నాయర్ వాదించారు. అంతేకాదు కపూర్ తోబుట్టువులు కోరిన మద్యంతర నిషేధంపై సమర్పణలు కూడా ఈ విచారణలో ఉన్నాయి.వారి దివంగత తండ్రికి చెందిన ఏవైనా ఆస్తులను ప్రియా వృథా చేయకుండా నిరోధించాలని కోర్టును అభ్యర్థించారు.. ఇరు వాదనలు విన్న జస్టిస్ జ్యోతి సింగ్ వీరి కేసు పై అసహనం వ్యక్తం చేశారు.. ఈ కేసుని మెలోడ్రామాగా మార్చవద్దని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను పదే పదే కోర్టు ముందుకు తీసుకురాకుండా ప్రైవేట్ గా కోర్టు బయటే పరిష్కరించుకోవాలని జ్యోతి సింగ్ కోరారు.

నకిలీ వీలునామా..

Advertisement

అయితే సంజయ్ కపూర్ మరణించాక ఆయన రెండో భార్య నకిలీ వీలునామాని సృష్టించారని తండ్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిందని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపించి కోర్టుకెక్కారు. కానీ సంజయ్ కపూర్ రెండో భార్య ప్రియా సచ్ దేవ్ మాత్రం పిల్లలు ఇప్పటికే కుటుంబ ట్రస్ట్ నుండి 1900 కోట్లు అందుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×