Heroine Poonam: అందాల తార.. దివంగత నటీమణి శ్రీదేవి(Sridevi) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఎన్ని మాటలు చెప్పినా ఇంకా వస్తూనే ఉంటాయి. తవ్వే కొద్ది ఆమె గురించి నిజాలు బయటపడుతూ ఉంటాయి అంటారు ఆమె అభిమానులు. అలా ఎంతోమంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న శ్రీదేవి హఠాత్తుగా చనిపోవడం చాలామందిని ఇబ్బంది పెట్టిన ఒక సంఘటన అని చెప్పుకోవచ్చు.శ్రీదేవి మరణంతో ఆమె అభిమానులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అయితే అలాంటి శ్రీదేవి ఉన్నన్ని రోజులు తన అమాయకపు చూపులతో ఎంతోమందిని తన వైపుకు తిప్పుకుంది. అయితే అలాంటి హీరోయిన్ శ్రీదేవిపై తాజాగా ఒక నటి చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీదేవి మీరందరూ అనుకుంటున్నట్లు తెలివి తక్కువది.. అమాయకురాలేం కాదు. అదంతా ఒక పెద్ద కుట్ర అంటూ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి.
శ్రీదేవి అమాయకురాలేం కాదు – పూనమ్ ధిల్లాన్
మరి ఇంతకీ శ్రీదేవి పై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ నటి ఎవరో కాదు పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon).. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన పూనమ్ ధిల్లాన్ శ్రీదేవితో కూడా కలిసి రెండు సినిమాల్లో నటించింది. అలా వీరిద్దరూ కలిసి నటించిన సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందట. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో పూనమ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. “శ్రీదేవిని మీడియా ఒక అమాయకురాలిగా ముద్ర వేసింది.కానీ శ్రీదేవి మీరు అనుకుంటున్నట్లు అమాయకురాలేం కాదు. ఆమె తెలివి తక్కువదని అందరూ అనుకుంటారు. కానీ ఆమె చాలా తెలివైనది. అంత తెలివి తక్కువదైతే ఇన్ని సినిమాల్లో నటించగలదా.. ఇంత అద్భుతమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకునేదా.. మీడియా ఆమెపై అమాయకుపు ముద్ర వేసింది.
శ్రీదేవి పై కుట్ర జరిగింది – పూనమ్ ధిల్లాన్..
కానీ అదంతా పెద్ద కుట్ర.. శ్రీదేవి ఎక్కువగా తన పనిని ఆరాధిస్తుంది. అందుకే అంత పెద్ద నటి అయింది.నేను శ్రీదేవితో రెండు సినిమాలు చేసే సమయంలో ఆమెను గమనించాను. ఆమె చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి” అంటూ శ్రీదేవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్..
శ్రీదేవి – పూనమ్ ధిల్లాన్ కాంబినేషన్లో సినిమాలు..
ఇక శ్రీదేవి పూనమ్ ధిల్లాన్ కాంబినేషన్లో జుదాయి (Judaai),సోనే పే సుహాగా(Sone Pe Suhaaga) వంటి సినిమాలు వచ్చాయి.. ఇక శ్రీదేవి సినిమా షూటింగ్ సమయంలో వ్యవహరించే తీరు గురించి, ఇప్పటికే ఎంతోమంది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి పని విషయంలో చాలా డెడికేటెడ్ గా ఉంటుంది అని, ఒక సినిమాకి కమిట్ అయిందంటే అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సినిమా మొత్తం కంప్లీట్ చేసే వరకు ఆమెకు మరో ధ్యాస ఉండదని ఇప్పటికే చాలామంది శ్రీదేవిని పొగిడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
దుబాయ్ లో అనుమానాస్పద స్థితిలో శ్రీదేవి మరణం..
అయితే అలాంటి శ్రీదేవి పెళ్లి వేడుక కోసం దుబాయ్(Dubai) కి వెళ్లి బాత్ టబ్ లో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక శ్రీదేవి మరణించిన సమయంలో ఆమెపై ఎన్నో రూమర్లు వినిపించాయి.శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమెని హత్య చేశారంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి. కానీ చివరికి ఆమెది సహజ మరణమే అని తేలింది.
ALSO READ:RJ Shekhar Basha : పార్లమెంట్‌లో పోరాటం చేస్తా… వారికి ప్రత్యేక బిల్ కావాల్సిందే!